పూర్ణాహుతి కార్య‌క్రమానికి హాజ‌రైన  సీఎం వైయ‌స్ జ‌గ‌న్

తాడేప‌ల్లిః  శ్రీ మహారుద్రసహిత ద్విసహస్ర చండీయాగ దీక్షాంత పూర్ణాహుతి కార్య‌క్ర‌మానికి   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  హాజ‌ర‌య్యారు. 23 మాసాలుగా జరుగుతున్న యాగం నేటితో సంపూర్ణం కానుంది.ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పూర్ణ హుతి కార్య‌క్ర‌మంలో  వైయ‌స్ఆర్‌సీపీ  పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయదుందుభి మోగించాలని, ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని 2017 జూలై 29 నుంచి 2019 జూన్‌ 29 వరకు ఈ చండీయాగాన్ని నిర్వహించారు.

 

Back to Top