మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నది మీ కోసమే

మీ జగన్‌లో కల్మషం లేదు

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం

సహాయక చర్యల కోసం అధికారులకు తగిన వనరులు, సమయం ఇచ్చా

వరద బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు 

ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించారు

డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం మా ప్రభుత్వానికి లేదు

మీకు మంచి జరగలేదు అనుకుంటే నేరుగా స్టేజీమీదకు వచ్చి మాట్లాడవచ్చు

సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదు

అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నదే నా లక్ష్యం

పోలవరం పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం

పోలవరం పరిహారం కేంద్రం స్వయంగా చెల్లించినా ఫర్వాలేదు

ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయమైన ప్యాకేజీ అందుతుంది

లిడార్‌ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతోంది

మా సంకల్పం అంతా ప్రజలకు న్యాయం చేయడమే

ఆర్‌అండ్‌ఆర్‌ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు

పోలవరం నిర్మాణంలో చంద్రబాబు బుద్ధి లేకుండా వ్యవహరించారు

వరద ప్రభావిత ప్రాంతంలో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటన

గ్రామస్తులతో ముఖ్యమంత్రి ముఖాముఖి

అల్లూరి సీతారామరాజు జిల్లా:   మీ బిడ్డ ముఖ్య‌మంత్రి స్థానంలో కూర్చున్న‌ది మీ కోస‌మేని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉద్ఘాటించారు. నా సంక‌ల్పం, త‌ప‌న‌, తాప‌త్ర‌యం అంతా ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయ‌డ‌మేని స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప‌ర్యటిస్తున్నారు. కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముఖాముఖి నిర్వ‌హించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు వరదలకు ప్రభావితం అయ్యే మండలాలు. వరద వచ్చినప్పుడు బహుశా గతంలో ఏ ప్రభుత్వమూ స్పందించనంత మానవతా దృక్పథంతో మన ప్రభుత్వం స్పందిస్తోంది. సహాయం చేసే విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా చేస్తున్నాం. వరద వచ్చిన వెంటనే కలెక్టర్లను ఎంపవర్‌ చేస్తున్నాం. కావాల్సిన వనరులు సమకూరుస్తున్నాం. అవసరమైన డబ్బులు వారి చేతుల్లో పెడుతున్నాం. కలెక్టర్‌ దగ్గర నుంచి, జాయింట్‌ కలెక్టర్ల దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, సచివాలయం దగ్గర నుంచి వాలంటీర్ల దాకా ప్రతి ఒక్కరినీ కూడా సహాయ కార్యక్రమాల్లో మమేకం  చేస్తున్నాం. ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అన్న లక్ష్యంతో అడుగులు వేశాం. దానికి తగ్గట్టుగానే కలెక్టర్‌కు డబ్బులు ఇవ్వడం, ఎంపవర్‌ చేయడం, ఎంపవర్‌ చేసిన తర్వాత కలెక్టర్‌కు తగినంత సమయం ఇస్తున్నాం. ఇప్పటికి వారం అయిపోయింది. 

ఆరోజే కలెక్టర్‌కు ఒక వారం తర్వాత నేను వస్తాను. నేను వచ్చే సమయానికల్లా ఏ ఒక్కరూ కూడా నాకు అందాల్సిన సహాయం అందలేదు అన్న మాట వినపడకూడదు అని చెప్పి ఆదేశాలిచ్చాం. ఎప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఇదే మాదిరిగా ఎప్పుడూ కూడా స్పందిస్తూ వస్తున్నాం. ఇదే ప్రొటోకాల్‌ను ఫాలో అవుతున్నాం. వరదల్లోనే మనం కూడా వచ్చి అధికారులంతా కూడా నాతోనే తిరుగుతూ ఫొటోలు తీసుకొని  ప్రచారంకోసం ప్రయత్నం చేయడం అన్నది సరైన పద్ధతి కాదు. దాని వల్ల ప్రజలకు జరగాల్సిన మంచి జరగకుండా పోతుంది. పైగా అధికారులను నా చుట్టూ తిప్పుకోవడం తప్ప దాని వల్ల జరిగే మంచేమీ ఉండదు పబ్లిసిటీకి తక్కువ ప్రాధాన్యత, పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే ఒక వారం వాళ్లకందరికీ టైమ్‌ ఇచ్చాం. 

మళ్లీ ఈరోజు ఇక్కడికి వచ్చి కలెక్టర్‌ బాగానే పని చేశాడా? అందాల్సినవి అన్నీ కూడా అందాయా? ఏ ఒక్క ఇంట్లో అయినా కూడా నీళ్లు వచ్చి, ఆ ఇంట్లో నీళ్లు వచ్చిన తర్వాత ఆ ఇంటికి రూ.2 వేలు డబ్బులు ఇవ్వకపోయి ఉంటే అది మన తప్పు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దేవుని దయ వల్ల కలెక్టర్‌ కూడా బాగానే స్పందించాడు. బాగానే పని చేశాడు. ఎక్కడా కూడా ఏ ఒక్కరూ కూడా అటువంటి పరిస్థితి ఉంది అన్న మాట వినపడలేదు. ఇది ఒక మంచి వాతావరణం. నీళ్లు ఇంట్లోకి వస్తే రూ.2 వేలు డబ్బులు ఇవ్వాలి. 5 రకాల రేషన్‌ కూడా సప్లయ్‌ చేయాలని కలెక్టర్లకు చెప్పాం. నీళ్లు రాకపోయినా కటాఫ్ అయిన గ్రామాల్లోని వారికి కూడా రేషన్‌ కచ్చితంగా అందాలి అని చెప్పడం జరిగింది. 

అదే రకంగానే ఇళ్లు ఏదైనా డ్యామేజ్‌ అయినపోయిన పరిస్థితిలో ఏదైనా ఉంటే పాక్షికంగా ధ్వంసం అయిందా లేదా సంపూర్ణంగా అయ్యిందా అన్న వర్గీకరణ లేకుండా కచ్చితంగా 10వేల రూపాయలు పేద వాడికి చేతిలో పెడితే తప్ప, వాళ్లు గుడిసెలు మళ్లీ వేసుకొనే పరిస్థితి కూడా ఉండదు. ఎన్యుమరేషన్‌ చేసి గ్రామ సచివాలయాల్లో ట్రాన్స్‌పరెంట్‌గా పేర్లన్నీ పెట్టి ఏ ఒక్కరైనా కూడా మిస్‌ అయిపోతే మాత్రం.. కచ్చితంగా మళ్లీ పేర్లు యాడ్‌ చేసే కార్యక్రమం కూడా కలెక్టర్లను మానవతా దృక్ఫథంతోనే వ్యవహరించండి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా బహుశా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించే తీరులో దేశానికి ఒక ఎగ్జాంపుల్‌గా ఉండేటటుగా చూపించగలిగాం. దేవుని దయతో చేయగలుగుతాఉన్నాం. 

కానీ ఒకే ఒక్క ఏరియాలో నేను కూడా మీ అందరి దగ్గరి నుంచి కూడా అనుకున్నంత వేగంగా చేయలేకపోయిన పని ఒకటుంది. అది ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇప్పించడం. అది నా చేతుల్లో ఉండే పని కాదు కాబట్టి నేను కూడా కష్టపడాల్సి వస్తోదంది. ఈ విషయంలో ఢిల్లీమీద ఆధారపడాల్సి వస్తోంది. కాబట్టి, వాళ్ల మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేతనైన కాడికి చేస్తూనే ఉన్నాను. అడుగులు ముందుకు వేస్తానే ఉన్నాం. 
మూడు సంవత్సరాల్లో పూర్తి డ్యామ్‌ను నింపుతారు. అందులో మొదటి స్టేజ్‌ మొదటి సంవత్సరంలో 41.15 మీటర్లకు నింపుతారు. డ్యామ్‌లోకి పూర్తిగా నీళ్లు నింపేశారంటే డ్యామ్‌ సెక్యూరిటీ దెబ్బ తింటుంది అని సీడబ్ల్యూసీ సెక్యూరిటీ నార్మ్స్‌ చెప్తున్నాయి. దీనికి సంబంధించిన సర్క్యులర్‌ కూడా ఉంది. 3 ఫేజ్‌లలో డ్యామ్‌ను ఫస్ట్‌ ఇంత, తర్వాత ఇంత, తర్వాత ఇంత అని మూడు సంవత్సరాల్లోమూడు ఫేజ్‌లలో నింపుకుంటూ పోవాలి. అప్పుడే డ్యామ్‌ పటిష్టంగా నిలబడుతుంది. చిన్నచిన్న రిపేర్లు ఏవైనా ఉంటే కూడా తెలిసిపోతుంది. అప్పుడు రిపేర్లు చేయవచ్చు. డ్యామ్‌ ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు అని సీడబ్ల్యూసీ సెక్యూరిటీ నార్మ్స్‌లో రాసి ఉన్న లేఖలను చూపిస్తా ఉన్నారు. దాని తగ్గట్టుగానే 41.15మీటర్లకు సంబంధించి మొట్ట మొదటగా ఫస్ట్‌ నీళ్లు నింపే కార్యక్రమం చేస్తారు.మనం ఈ 41.15 నింపితే కటాఫ్‌ అయిపోయే ఊర్లు, కటాఫ్‌అయిపోయే గ్రామాలు కూడా ఇంకా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామాలను కూడా ఫస్ట్‌ ఫేజ్‌లోనే తీసుకొని రాకపోతే ఆ ఊర్లకు పోవడానికి ఇబ్బంది అవుతుంది. రోడ్లు కూడా ఉండవు. పోవడానికి యాక్సెస్‌ కూడా ఉండదు ఆ ఊర్లకు అని మనం మళ్లీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మనం లిడార్‌ సర్వే చేయించి మళ్లీ 48 హ్యాబిటేషన్స్‌ను, 32 గ్రామాల్లో 48 హ్యాబిటేషన్స్‌ను మళ్లీ యాడ్‌ చేయించాం. 
దీనికి కేంద్ర కేబినెట్‌ ఆమోదంకోసం కిందా మీదా పడుతున్నాం. కుస్తీలు పడుతున్నాం. ఇదంతా మీ అందరికీ కూడా తెలిసిందే. మన ఖర్మేంది అనంటే, ఇదంతా ఎందుకు స్టార్ట్‌ అయిందంటే ఇంతకు ముందు ప్రభుత్వం 2013-2014 రేట్లతోనే మేము ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం అని అండర్‌టేకింగ్‌ ఇచ్చింది. ఈ పోలవరం కట్టే బాధ్యత మాకిస్తే చాలు.. మేము 2013-14 రేట్లతోనే మేము పూర్తి చేస్తామని ఒక అండర్‌ టేకింగ్‌ ఇచ్చారు. అండర్‌ టేకింగ్ ఇచ్చిన ఆ పరిస్థితుల్లో వాళ్లు అంతకన్నామేం డబ్బు ఇవ్వము, ఎందుకు ఇవ్వాలి, ఇదిగో మీ ముఖ్యమంత్రి, మీ వాళ్లే సంతకం పెట్టారు అని కేంద్రం వాళ్లు చెప్పడం మొదలుపెట్టారు. 
మేము డైరెక్ట్‌గా మోడీ గారి దగ్గరకు, కేంద్ర మంత్రులవద్దకు వెళ్లి వారికి అన్ని రకాలుగా తెలియజేశాం. గత ఏడాదిలో, మనం 2022లో మనం ఉన్నాం. 2013-14 రేట్ల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయాలి అనంటే ఎట్లా చేయగలుగుతారు? ఆర్‌అండ్‌ ఆర్‌కు కూడా వాళ్లిచ్చే ప్యాకేజీలు కూడా మారిపోతాయి. 18 సంవత్సరాలు వచ్చే వయసు వాళ్లు కూడా సంఖ్యా బలం కూడా పెరిగిపోతుంది. అన్నీ కూడా మారిపోతాఉంటాయి. ఎల్‌ఏ మారుతుంది, ఆర్‌అండ్‌ఆర్‌ మారుతుంది. కన్‌స్ట్రక్షన్‌ కాస్ట్‌ మారుతుంది. అన్నీ కూడా మారుతున్నాయి. మీకు తెలియంది ఏముంది? శ్రీశైలం ప్రాజెక్టు ఎంతటితో స్టార్ట్‌ చేశారు? ఎంతతో ఎండ్‌ అయిపోయింది? ఇవన్నీ తెలిసి ఉండి కూడా 2013-14 తోనే మీరు ఎలా పూర్తి చేస్తారు.ఆ రేట్లతోనే పూర్తి చేయగలుగుతాము అని వాళ్లెవరో అడగడం ఏంది? మీరేదో దాన్ని ఒప్పుకోవడం ఏంది? 2022లో మేం అంతకన్నా డబ్బులు ఇవ్వము అని చెప్పడం ఏంది? కరెక్టా మీరు చేసేది అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా నిలదీస్తూ కూడా దాన్ని అర్థమయ్యేట్లుగా చెప్పడం జరిగింది. 

ఇవన్నీచెప్పిన నేపథ్యంలో వాళ్లలోకూడా కొంత కదలిక వచ్చింది. సానుకూల వాతావరణం వచ్చింది. ఇప్పుడు ఉన్న రేట్లకు మళ్లీ రివైజ్‌ చేసి మళ్లీ ఇప్పుడు మనకు ప్రాజెక్టును పూర్తిచేసే కార్యక్రమం మొదలు పెట్టడానికి అడుగులు వేశాం. ఈ అడుగులు వేసే కార్యక్రమంలో భాగంగా ఇది జరగాలి అనంటే కేంద్ర కేబినెట్‌ ఆమోదించాల్సి ఉంది. దీనికోసం పోలవరం ప్రాజెక్ట్‌ ఎస్టిమేట్స్‌ అన్నీ తయారు చేసి వాళ్లు ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్లు రాటిఫై చేసిన తర్వాత సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ సీడబ్ల్యూసీ వాళ్లకు పంపించడం జరిగింది. ఒక వారం కిందట వాళ్ల దగ్గరకు వెళ్లిపోయింది. వాళ్లు కూడా మరో వారంలో అప్రూవల్‌ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత జలశక్తి శాఖకు వస్తుంది. జలశక్తి మినిస్ట్రీ కేబినెట్‌కు పెడుతుంది. బహుశా దేవుడు ఆశీర్వదిస్తే నాకు తెలిసి ఈ నెలాఖరు కల్లా కేబినెట్‌కు ఇది వచ్చే కార్యక్రమం జరుగుతుంది. 

దేవుడి దయవల్ల కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపితే తొలి ప్రాధాన్యతాపనులకోసం రూ.17 వేల కోట్లు మనకు ఇవ్వడానికి సుముఖత వ్యక్తపరిచే కార్యక్రమం జరుగుతుంది. దీని వల్ల, మోస్ట్‌ ఇంపార్టెంట్‌గా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయి. డ్యామ్‌ అంతా కూడా పూర్తి హైట్‌కు కంప్లీట్‌ అవుతుంది. కంప్లీట్‌ కావడమే కాకుండా 41.15 మీటర్ల వరకు నీళ్లు నింపడానికి పూర్తిగా ఆర్‌అండర్‌ఆర్‌కు సంబంధించి పూర్తిగా ఎంతమంది అయితే ఉంటారో వాళ్లందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. లిడార్‌ సర్వే ద్వారా గుర్తించిన 48 ఆవాసాలనుకూడా మొదటి పునరావాస ప్రాధాన్యత కింద ఆమోదించమని అడిగాం. దాని తర్వాత సెకండ్‌ ఇయర్‌కి సెకండ్‌ ఫేజ్‌, దాని తర్వాత థర్డ్‌ ఇయర్‌ థర్డ్‌ ఫేజ్‌. ఇది మనం అంతా కూడా రాజీ పడక తప్పని అంశం. ఎందుకంటే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతోంది. వాళ్లను ఒప్పించేందుకు కృషి చేస్తున్నాం. బహుశా జగనే కడితే మొదట మీకు ఇచ్చి, తర్వాత తర్వాత ప్రాజెక్టు గురించి ఆలోచన చేసేవాడినేమో. కాకపోతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. వాళ్ల దగ్గరి నుంచి తీసుకోవాల్సిందే కాబట్టి ఈ ఫేజ్‌ ప్రకారం జరగాల్సిందే. ఇందులో విచిత్రమేమిటనంటే మనం రాక మునుపు కేవలం 3 వేల కుటుంబాలను మాత్రమే తరలించారు. నం వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలోఇప్పటికే 12 వేల కుటుంబాలను షిప్ట్‌ చేశాం. మరో 8 వేల కుటుంబాలను అంటే, మొత్తంగా 20 వేలు కుటుంబాలను తరలిస్తున్నాం. 

బహుశా ఈ 20 వేల కుటుంబాలకు సంబంధించి ఈ 12 వేలు కాక ఇప్పుడుమరో 8 వేలు ఏదైతే ఉన్నాయో వారికోసం ఇంకొక రూ. 800 కోట్ల డబ్బులు అవసరం ఉంది. రూ. 800 కోట్లు మనమే కిందమీద పడి ఎలాగోలా చేసేస్తాం. బహుశా ఈ నెలాఖరుకో లేకపోతే వచ్చే నెలకల్లా పూర్తిచేస్తాం. నాన్నగారి హయాంలో దాదాపు ఒక 47 వేల ఎకరాలకు సంబంధించిన భూసేకరణ జరిగింది. జరిగినప్పుడు లక్షా పది వేలకు, లక్షన్నరకు, లక్షా 50 వేలకు రకరకాల పద్ధతిలో అప్పుడు భూసేకరణకు ముందుకు వచ్చారు. 
పోలవరం ప్రాజెక్టుకు సహాయం చేయడానికి త్యాగం చేసిన రైతులు ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్లే. ఆరోజు వీళ్లు భూములు ఇవ్వకపోయి ఉంటే వాళ్లు కూడా కోర్టులో కేసులు వేసి ఈ మాదిరిగానే చంద్రబాబునాయుడు చేసినట్లుగానే చేసిఉండుంటే వాళ్లకు కూడా ఈ మాదిరిగానే వచ్చేది కదా.. వాళ్ల పట్ల సానుభూతి చూపించాలి కదా.. అని చెప్పి కచ్చితంగా 5 లక్షల రూపాయలు వాళ్లందరికీ ప్యాకేజీ ఇస్తాము అని చెప్పాం. లక్షన్నర అప్పట్లో ఇచ్చిఉంటే మరో మూడున్నర లక్ష మనం ఇస్తాము. 5 లక్షల రూపాయలు కనీసంగా వాళ్లకు వచ్చేలా చూస్తాం. దీనికి సంబంధించి మనం ఏదైతే ఆ డబ్బు ఇవ్వాలోఆ డబ్బు మనం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అది మనం ఇచ్చిన మాట. నేను చేస్తా. నా మీద నమ్మకం ఉంచండి. ఇది కాక రెండోమాట కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు 6.8 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీల కింద ఇస్తోంది. దాన్ని 10 లక్షలు చేస్తాం. దానికి సంబంధించి 3.2 లక్షలు ఏదైతే డిఫరెన్స్‌ అమౌంట్‌ ఏదైతే ఉందో అది కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది కూడా నేను మాటిచ్చాను. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా చేసి తీరుతుంది. ఇది కూడా 41.15 లెవల్‌లోకి నీళ్లు నింపే టైమ్‌కల్లా కేంద్రం ఇవ్వాల్సింది కేంద్రం ఇస్తుంది, మనం ఇవ్వాల్సిన డబ్బు కూడా మనం ఇస్తాం. ప్రతి రైతన్నలో కూడా చిరునవ్వుచూసిన తర్వాతనే ఆ నీళ్లు నింపే కార్యక్రమం జరిగిస్తాను అని మాట చెబుతున్నా. 
ఈ జనవరి ప్రాంతంలో కచ్చితంగా అందరికీ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి అది కూడా జనవరికల్లా అయిపోజేసే కార్యక్రమం ప్రయత్నంచేస్తాం. 

గత ప్రభుత్వం ఇంకక తప్పుచేశారు. ఆ తప్పిదం ఏంటంటే స్పిల్‌వే కట్టకుండా డయాఫ్రం వాల్‌ కట్టారు. ఫస్ట్‌ స్పిల్‌వే పూర్తి చేసి నీళ్లు డైవర్ట్‌ చేసి ఆ తర్వాత కాఫర్‌ డ్యామ్‌ కట్టాలి. కాఫర్ డ్యామ్‌ కట్టిన తర్వాత డయాఫ్రం వాల్‌ తర్వాత వెనకాల కట్టాలి. అలా చేస్తే డ్యామేజ్‌ అనేది జరగదు. కానీ మన ఖర్మ కొద్దీ ఆరోజుల్లో కేవలం కాంట్రాక్టర్లకు మంచి చేయడం కోసమే వర్క్‌లు చేయడం మొదలు పెట్టి, ఇష్టమొచ్చినట్లుగా ప్లానింగ్‌ లేకుండాచేశారు. ఆ స్పిల్‌వే పనులు అసంపూర్ణంగా వదిలి పెట్టారు. వదిలిపెట్టారు కాబట్టే నీళ్లు అటువైపు నుంచి డైవర్ట్‌ చేయలేకపోయారు. నీళ్లు అటువైపు నుంచి డైవర్ట్‌ చేయలేకపోయారు కాబట్టి అటువైపున నీళ్లు పంపించలేకపోయారు. పైగా అది కంప్లీట్‌ కాకుండానే మధ్యలో కాఫర్‌ డ్యామ్‌ కన్‌స్ట్రక్షన్‌కూడా మొదలు పెట్టారు. మెయిన్‌ డ్యామ్‌ కోసం డయాఫ్రం వాల్‌ పునాదులు కార్యక్రమం కూడా చేయడం మొదలు పెట్టారు. 

పునాదులు చేసే కార్యక్రమం అయిపోలేదు, డ్యామ్‌ అనేదిదాన్ని పూర్తి చేయలేకపోయారు.  రెండున్నర కిలోమీటర్ల గోదావరి వెడల్పులో కాఫర్‌ డ్యామ్‌లో రెండు గ్యాప్‌లు విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ కాఫర్‌ డ్యామ్‌లో ఆ గ్యాప్‌లు మధ్యలో ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందంటే కారణం నీళ్లు పోవాలి. స్పిల్‌వే మీద నుంచి పంపించలేరు కాబట్టే ఇలాగ్యాప్‌లు వదిలేశారు. గోదావరి పొంగిందో అప్పుడు ఆ గ్యాపుల్లో నుంచి మాత్రమే నీళ్లు రావాల్సి వచ్చింది. దాని వల్ల వెలాసిటీ పెరిగింది. స్పీడ్‌ పెరిగింది. దాని వల్ల డయాఫ్రంవాల్‌ కోతకు గురైంది. ఇవన్నీ జరగడంతో ఇప్పుడా నిర్మాణాన్ని మళ్లీ కరెక్ట్‌గా కట్టడంకోసం ఇన్నిరోజులపాటు అధ్యయనం జరుగుతోంది. 

ఈ అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా మనం కాఫర్‌డ్యాంలు పూర్తిచేశాం. మరోవైపు స్పిల్‌వేనుఏ పూర్తిచేసిన దానిమీదుగా నీళ్లని పంపిస్తున్నాం. నీళ్లన్నీ ఇటువైపు నుంచి రాకుండా స్పిల్‌వే మీదుగా పోయేట్టుగా చేశాం. ఇవన్నీ మనం చేయగలిగాం.  సో ఇవన్నింటి వల్ల గత ప్రభుత్వం చేసిన తప్పులవల్ల ప్రాజెక్టు మనం అనుకున్నంత స్పీడ్‌లో ముందుకు వెళ్లలేకపోయింది. ఇప్పుడు వీటన్నింటినీ అధిగమించి ఇప్పుడు దేవుని దయ వల్ల కొంచం గాడిలోపడింది. 2025 ఖరీఫ్‌కల్లా కచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. 2025 జూలై, ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా దేవుని దయ వల్ల కచ్చితంగా ఏర్పడుతుంది.
 

Back to Top