మాజీ మంత్రి ఆర్కే రోజా ప‌రామ‌ర్శ‌

చిత్తూరు:  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు మోహన్ సోదరుడు నాగేంద్రన్ ఇటీవ‌ల మృతి చెంద‌డంతో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను మాజీ మంత్రి ఆర్.కె. రోజా పరామర్శించారు. మంగ‌ళ‌వారం ఆమె విజయపురం మండలం  జగన్నాధపురం గ్రామంలో ప‌ర్య‌టించారు.  నాగేంద్రన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి దైర్యం చెప్పారు.  ఈ దుఃఖ సమయంలో పార్టీ తరఫున కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాగేంద్రన్  ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆమె ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 

Back to Top