సీఎం వైయస్‌ జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రిగిన‌ స‌మావేశంలో చిరంజీవి, నాగార్జున, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్‌రాజు, రాజమౌళి, త్రివిక్రమ్‌ పాల్గొన్నారు. సినీ పరిశ్రమలోని కష్టాలను సీఎం వైయస్‌ జగన్‌తో చర్చించారు. ఏపీలో షూటింగ్‌లకు సింగిల్‌ విండో అనుమతి ఇవ్వడంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు. 

Back to Top