బాధిత కుటుంబానికి చుండూరి ర‌విబాబు ప‌రామ‌ర్శ‌

ఒంగోలు: సైకో దాడిలో గాయ‌ప‌డి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న మ‌హిళ‌ను వైయ‌స్ఆర్‌సీపీ ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ చుండూరి ర‌విబాబు ప‌రామ‌ర్శించారు. కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామానికి చెందిన పూరిని సీతారామమ్మ, సుబ్బారెడ్డి దంపతులు కుమారుడు నాగార్జున, కుమార్తె నందినితో కలిసి జీవిస్తున్నారు. వారి నివాసానికి పక్కనే ఉంటున్న చినిగే సాయిరెడ్డి తరచూ నందినిని వేధింపులకు పాల్పడేవాడు. నందినిని లైంగికంగా వేధిస్తున్నాడని, ఇటీవల సుబ్బారెడ్డి మందలించడంతో సాయిరెడ్డి కక్ష పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఒక రోజు గంజాయి మత్తులో నందిని ఇంటికి వెళ్లి దాడి చేయడంతో పాటు అశ్లీలంగా ప్రవర్తించాడు. అలాగే సీతారామమ్మ తలపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో రక్షణ కోసం బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గాయాలపాలైన సీతారామమ్మను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. విష‌యం తెలుసుకున్న చుండూరి ర‌విబాబు, కొత్తపట్నం మండలం అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, మోటుమాల గ్రామ సర్పంచ్ గోపి తదితర నాయకులు ఆసుపత్రికి వెళ్లి సీతారామమ్మను పరామర్శించి ధైర్యం చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ మీకు అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా క‌ల్పించారు. 

Back to Top