'ఆ దేవుడికి, మీకు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను'

ఇళ్ల స్థ‌లాల పంపిణీ అనంత‌రం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: అమ‌రావ‌తిలో నిరుపేద అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఇళ్ల స్థ‌లాల పంపిణీ కార్య‌క్ర‌మం అనంత‌రం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ట్వీట్ చేశారు. ``అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్ళ స్థ‌లాలు ఇచ్చేందుకు మ‌న ప్ర‌భుత్వం సుప్రీంకోర్ట్ వ‌ర‌కూ వెళ్ళి పోరాడింది. నేడు అదే అమ‌రావ‌తిలో రూ.7 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌లు విలువ చేసే ఇళ్ళ స్థ‌లాల‌కు 50,793 మంది అక్క‌చెల్లెమ్మ‌ల‌ను య‌జ‌మానుల‌ను చేసింది మ‌న ప్ర‌భుత్వం. ఇంత మంచి కార్య‌క్ర‌మం నిర్వ‌హించే అవ‌కాశాన్ని నాకు క‌ల్పించిన దేవుడికి, మీకు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను`` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

https://twitter.com/ysjagan/status/1662059353564905478?s=20

Back to Top