సంతోషాలకు, ఆనందాలకు సజీవసాక్ష్యం ‘ఇల్లు’

నా పుట్టినరోజున మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

ఇంటిపై పూర్తి హక్కు కల్పిస్తూ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పట్టాలు అందజేత

రూ. 10 వేలకోట్ల రుణమాఫీ, రూ. 6 వేలకోట్ల రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ చార్జీలు మినహాయింపు

52 లక్షల మంది చేతుల్లో పెట్టబోయే ఆస్తి విలువ అక్షరాల రూ.1.58 లక్షల కోట్లు

నామమాత్రపు రుసుముతో గ్రామ,వార్డు సచివాలయాల్లో 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌

మంచి చేస్తుంటే చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు

మీకెందుకంత కడుపుమంట అని పేదలపాలిట శత్రువులను గట్టిగా ప్రశ్నించండి

పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టులకెళ్లి అడ్డుకోవడం కరెక్టేనా అని నిలదీయండి

అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో ఏప్రిల్‌ 2 వరకు ఈ పథకం పొడిగింపు 

తణుకు సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తణుకు: ‘‘ఇల్లు అంటే కేవలం ఇటుకలు, స్టీల్‌తో కట్టిన కట్టడం మాత్రమే కాదు.  సుదీర్ఘకాలం పడే కష్టానికి, సంతోషాలకు, ఆనందాలకు సజీవసాక్ష్యం. నా పుట్టిన రోజు నాడు దాదాపుగా 50 లక్షల పైచిలుకు కుటుంబాలకు మంచి జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది. దేవుడి దయతో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుడుతున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటిపై సంపూర్ణ హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందజేశారు. ఈ పథకం ద్వారా దాదాపు రూ. 10 వేల కోట్ల రుణమాఫీతో పాటు, రూ. 6 వేల కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్‌ డ్యూటీ చార్జీల మినహాయింపుతో దాదాపు రూ. 16 వేల కోట్ల మేర లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. నామమాత్రపు రుసుముతో 10 నిమిషాల్లోనే గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసి.. ఆ ఇంటిపై పూర్తి హక్కును కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందజేస్తామన్నారు. 

సభను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘సొంత ఊరు మాదిరిగానే.. మనం ఉన్న ఇల్లు కూడా మన జీవితకాలం గుర్తుపెట్టుకుంటాం. ఒక ఇల్లు ఎంత అవసరమో తెలుసు. కుటుంబంలో రూపాయి రూపాయి కూడా కూడబెట్టి.. ఆ ప్రతి రూపాయితో చివరకు తమ పిల్లలకు ఒక ఆస్తిగా ఇవ్వడానికి ముందుకువేసే పరిస్థితి ఏదైనా ఉంటుందంటే.. అది చక్కటి ఇల్లు కట్టుకొని, బతికినంతకాలం అనుభవించి తదనంతరం ఒక ఆస్తిగా ఆ ఇంటిని తమ పిల్లలకు ఇవ్వాలని పొదుపు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటారు. అటువంటి కలను నిజం చేస్తూ ఇప్పటికే రెండున్నరేళ్ల కాలంలోనే దేవుడి దయ, మనందరి ప్రభుత్వం 31  లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తున్నాను. 

31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ అంటే.. చరిత్రలో ఎప్పుడూ కూడా  కనివినీ ఎరుగని విధంగా ప్రతి పేదకు సొంతింటి కలను అన్నగా సహకారం చేస్తూ నిండుమనసుతో 31 లక్షల ఇళ్ల పట్టాలను ఇప్పటికే అక్కచెల్లెమ్మలకు అందించడం జరిగింది. అక్షరాల 31 లక్షల ఇళ్లు అంటే.. అందులో ఇప్పటికే 15.60 లక్షల ఇళ్లకు సంబంధించి నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. 31 లక్షల ఇంటి స్థలాల విలువ  అక్షరాల రూ.26 వేల కోట్లు. 31 లక్షల ఇళ్లు కట్టడం పూర్తయిన తరువాత ఆ ఇంటికి పెట్టిన ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌తో కలుపుకుంటే ప్రతి అక్క చేతిలో కనీసం అంటే రూ.5 నుంచి 10 లక్షలు నేరుగా వారి చేతుల్లో పెట్టినట్టే అవుతుంది. ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

అలాగే రాష్ట్రంలో దాదాపుగా 52 లక్షల మందికి తమ ఇంటిలో నివసించే హక్కు మాత్రమే ఉన్న ఈ కుటుంబాలకు.. స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇంటి పట్టాలు, స్థలాలు వస్తున్నాయి. వారికి నివసించే హక్కు మాత్రమే ఉన్న కుటుంబాలకు.. వారి ఇంటిపై సర్వహక్కులు ఇచ్చేందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తీసుకువచ్చాం. 52 లక్షల మందిలో ఓటీఎస్‌ ద్వారా 8.26 లక్షల మందికి నేటి నుంచి వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి.. ఆ డాక్యుమెంట్లను వారి చేతుల్లో పెట్టి.. ఆ ఇంటి మీద వారికి సంపూర్ణ హక్కును వారి పేరుతో రిజిస్టర్‌ చేసి వారి చేతికి ఈ రోజు నుంచే ఇవ్వనున్నాం. గొప్ప మార్పునకు ఇదొక చిహ్నం. 

52 లక్షల మంది చేతుల్లో పెట్టబోయే ఆస్తి విలువ అక్షరాల రూ.1.58 లక్షల కోట్ల ఆస్తిని నేరుగా వారి చేతుల్లో పెట్టబోతున్నాం. వారి ఇష్టం మేరకు దాన్ని ఉపయోగించుకోవచ్చు. 

ఒక ఇంటికి కిరాయి చెల్లిస్తే.. ఆ ఇంట్లో ఉండేందుకు మాత్రమే హక్కులు ఉంటాయి. అదే సొంతిల్లు అయితే మార్కెట్‌ రేటుకు ఆ ఇంటిని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అమ్ముకునే వీలు, ఆ ఇంటిపైహక్కు  మనకు ఉంటుంది. ఇళ్ల పరిస్థితి గురించి చెప్పాలంటే.. ఈరోజు  మనం ఉంటున్న ఇల్లు అమ్ముకునే హక్కు లేదు. మన సంతానానికి ఇంటిని చట్టపరంగా రిజిస్టర్‌ చేసి పట్టా ఆధారంగా రాసి ఇచ్చే హక్కు  లేదు. అవసరం వచ్చినప్పుడు ఇంటిని బ్యాంకుల్లో తనఖా పెట్టుకొని డబ్బు తీసుకునే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ హక్కులేని గతకాలం నుంచి ప్రభుత్వాలు కట్టించి ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఉంటున్నాం. ఈ ఇళ్లకు సంబంధించి ఇటువంటి పరిస్థితిని పూర్తిగా ఈరోజు నుంచి మార్చబోతున్నాం. 

ఏ ఇంటి యజమాని అయినా కూడా తన అవసరాల కోసం తాను నివసించే ఇంటిని తనఖా పెడతామంటే లోన్‌ ఇవ్వడానికి ఏ బ్యాంకు కూడా ఒప్పుకొనిపరిస్థితిని మార్చడానికి శ్రీకారం చుడుతున్నాం. ఇంటిపై హక్కు లేకపోతే మార్కెట్‌లో రూ.10 లక్షలు పలికే ఇంటి విలువ.. హక్కులు లేకపోతే చెనిక్కాయలు, బెల్లాలకు రూ. 1 లక్ష –  రూ. 2 లక్షలకు కొనుక్కునేవారు ఉండరు. అటువంటి పరిస్థితిని మారుస్తూ పూర్తి హక్కులతో ఆ అక్కచెల్లెమ్మలు, ఇంటి యజమాని ఇంటిని అవసరానికి అమ్ముకునే స్వేచ్ఛను కల్పిస్తున్నాం. 

పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ చేసిన ఇంటికి, రిజిస్ట్రేషన్‌ చేయని ఇంటికి తేడా ఎంతుందో ఒక్కసారి గమనించండి. తణుకు 19వ వార్డులో ఇంటి మార్కెట్‌ విలువ అక్షరాల రూ.30 లక్షలు. సెంటు రూ. 15 లక్షలు పలుకుతుంది. 12వ వార్డులో ఇంటి మార్కెట్‌ విలువ రూ.12 లక్షలు. సెంటు రూ. 6 లక్షలు పలుకుతుంది. 7వ వార్డులో సెంటు విలువ రూ.15 లక్షలు. ఇంటికి మార్కెట్‌ విలువ రూ.30 లక్షలు పలుకుతుంది. ఇదే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మార్కెట్‌ విలువలు ఇలాగే ఉన్నాయి. 

రాష్ట్రమంతా చూసినా కూడా ఎక్కడ చూసినా ఇంటి విలువలు కనీసం రూ. 4, 5 లక్షల నుంచి రూ. 20, 30 లక్షల వరకు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సొంత ఇంటి మీద పూర్తి హక్కులు లేని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు నష్టపోతుంది. ఇంట్లో నివసిస్తున్నారు కానీ అమ్ముకునే స్వేచ్ఛ లేదు. తాకట్టుపెట్టుకునే అవకాశం లేదు. పిల్లలకు బహుమతిగా ఇచ్చే స్వేచ్ఛకూడా లేని పరిస్థితుల్లో వీరంతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యలంతటికీ పరిష్కారం ఏంటని నా పాదయాత్రలో నన్ను అడిగి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఏం చేస్తే బాగుంటుందని సమాధానం వెతికిన పిమ్మట.. మంచి ఆలోచనలతో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పుట్టుకొచ్చిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

ఈ పథకం ద్వారా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి గవర్నమెంట్‌ ఇచ్చిన లేదా కట్టించిన ఇళ్లలో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న లబ్ధిదారులను ఈరోజు నుంచి ఆ ఇళ్లకు పూర్తిస్థాయి యజమానులుగా మార్చబోతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇంటిపై సర్వహక్కులను రిజిస్టర్‌ చేసి ఇవ్వబోతున్నాం. ఇంటిని మార్కెట్‌ రేటుకు చట్టబద్ధంగా రిజిస్ట్రర్‌ ఇల్లుగా అమ్ముకునేందుకు వీలుంటుంది. బహుమతికి ఎవరికైనా ఇవ్వొచ్చు. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లి తాకట్టుపెట్టే వెసులుబాటు కూడా సర్వహక్కులు ఇవ్వడం వల్ల జరుగుతుంది. 

అంతేకాకుండా మరీ ముఖ్యంగా.. మనం ఉంటున్న ఇళ్లను కబ్జాలకు కాకుండా అడ్డుకట్ట కూడా పడుతుంది. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో తమ సొంత డబ్బుతో వారే ఇల్లు నిర్మించుకొని కేవలం నివాస హక్కులు మాత్రమే అనుభవిస్తున్న దాదాపుగా 12 లక్షల కుటుంబాలకు ఈ స్కీమ్‌ వల్ల కేవలం రూ.10 చెల్లిస్తే చాలు వారికి పూర్తిగా రిజిస్ట్రేషన్‌ చేయించి.. ఇంటి మీద సర్వహక్కులను కల్పిస్తాం. 

మొత్తంగా రాష్ట్రంలో 52 లక్షల గృహ నిర్మాణ లబ్ధిదారుల్లో 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి.. ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు తీసుకున్న మిగతా 40 లక్షల మంది లబ్ధిదారులకు అసలు, వడ్డీ రెండూ కలిపి దాదాపు రూ.14,400 కోట్లు బకాయిలుగా ఉన్నాయి. అందులో ఏకంగా రూ.10 వేల కోట్లు పూర్తిగా మాఫీ చేసి ఇస్తున్నాం. అసలు, వడ్డీ కలిపి రూ.10 వేల కోట్లు మాఫీ చేయడం కాకుండా.. వీళ్లకు దాదాపుగా రూ.6 వేల కోట్లు అంటే.. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఏడున్నర శాతం రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ చార్జీలు కట్టాలి. ఇంటి రిజిస్ట్రేషన్‌ విలువ రూ. 1.58 లక్షలు ఉంటే.. రిజిస్ట్రేషన్‌ విలువ కనీసం సగం ఉంటుంది. ఇంటి విలువ రూ.15 లక్షలు లెక్కవేసుకున్నా.. కనీసం రూ. 1 లక్ష రిజిస్ట్రేషన్‌ చార్జీలు కట్టాల్సి వస్తుంది. అవి కూడా పూర్తిగా మాఫీ చేస్తూ.. ఉచితంగా మరో రూ. 6 వేల కోట్ల లబ్ధి చేకూర్చనున్నామని తెలియజేస్తున్నాం. 

అక్షరాల రూ.16 వేల కోట్లు మాఫీ చేస్తూ అందరికీ లబ్ధి చేకూరుస్తున్నాం. గృహ నిర్మాణ సంస్థ ద్వారా లోన్‌ తీసుకొని వడ్డీ, అసలు పేరుకుపోయి కట్టుకోలేని పరిస్థితుల్లో వీరందరికీ గ్రామాల్లో అయితే కేవలం రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో కేవలం రూ.15 వేలు, కార్పొరేషన్‌ అయితే కేవలం రూ. 20 వేలు చెల్లిస్తే చాలు.. వీరందరికీ ఇంటిపై సర్వహక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌ ఉచితంగా చేయించి.. వాళ్ల ఆస్తిని, వారి చేతుల్లో పెడుతున్నాం. ఈరోజు వారు తీసుకున్న రుణం కొద్దోగొప్పో కట్టి ఉంటే.. రుణం చెల్లించాల్సిన రుసుము కంటే తక్కువగా ఉంటే వారు మాత్రం ఆ తక్కువ మొత్తం చెల్లిస్తే చాలు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించి ఇళ్ల పట్టాలు అందిస్తాం. తద్వారా వారి ఆస్తుల విలువ మార్కెట్‌ విలువకు సమానంగా పెరిగే వాతావరణం కలుగుతుంది. 

అసలు, వడ్డీ కలిపి రుణం కట్టిన కొంత మందికి కేవలం డీఫాం మాత్రమే ఇచ్చారు. అలా కాకుండా రిజిస్ట్రర్‌ డాక్యుమెంట్లు చేయించి వారి చేతుల్లో పెడుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 41 వేల మంది ఇదే కార్యక్రమం చేశారు. ఇంటి స్థలం తీసుకోవాలనే  ఆరాటంతో అసలు, వడ్డీ కడితే.. వారికి డీఫాం మాత్రమే దక్కింది. అటువంటి వారందరికీ రిజిస్ట్రేషన్‌ చేసి డాక్యుమెంట్లు ఇస్తున్నాం. 

గతంలో అంతా నిషేధిత భూముల జాబితా.. 22 ఏలో ఉండేది. నిషేధిత జాబితా నుంచి లబ్ధిదారుల స్థిరాస్థి పూర్తిగా తొలగించడం జరుగుతుంది. సబ్‌రిజిస్ట్రర్‌ కార్యాలయానికి వెళ్లి గంటలు, రోజుల తరబడి నిరీక్షించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటిని మీ గ్రామం, మీ వార్డు సచివాలయంలోనే నామమాత్రపు రుసుము కడితే చాలు కేవలం 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. క్రయవిక్రయాలు జరపడానికి ఏ విధమైన లింకు డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. వివాదాల ఆస్థి అనుకున్న ఇంటిని.. అత్యంత క్లియర్‌ టైటిల్‌గా, వివాద రహిత ఆస్తిగా మార్చి రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తున్నామని తెలియజేస్తున్నాను. 

నివాస హక్కు మాత్రమే అనుభవిస్తున్న పేదలందరికీ విజ్ఞప్తి. మంచి చేయడానికి ఆరాటపడుతున్న మీ అన్న, మీ తమ్ముడి ప్రభుత్వం మంచి చేస్తుంటే జీర్ణించుకోలేని శక్తులు చాలా ఉన్నాయి. పేదవాడికి మంచి జరుగుతుంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లంతా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వీరంతా మీ దగ్గరకు వస్తే కొన్ని ప్రశ్నలు అడగమని కోరుతున్నా.. మీకున్నవి, మీరు కొన్నవి రేట్లు పెరిగే రిజిస్ట్రర్డ్‌ భూములు అయినప్పుడు.. మాకూ అలాగే రేట్లు పెరిగే నామమాత్రపు ధరకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇల్లు ఇస్తామని మా అన్న చెబుతుంటే.. మీకెందుకు కడుపుమంట అని అడగండి. 

అయ్యా.. మా ఇళ్లను మీరు ఓటీఎస్‌ లేకుండా మార్కెట్‌ రేటుకు మీరు కొంటారా అని గట్టిగా నిలదీయండి. మీ వారసులకేమో.. మీ ఆస్తులు రిజిస్టర్‌ చేసి ఇస్తారు కదయ్యా.. మా వారసులకు మా ఇల్లు చట్టబద్ధంగా రిజిస్ట్రర్‌ చేసే అవకాశాన్ని మా జగనన్న మాకిస్తుంటే.. మీకెందుకయ్యా కడుపుమంట అని చెప్పి గట్టిగా అడగండి. 

2014–19 చంద్రబాబు పరిపాలనలో.. అధికారులు ఐదుసార్లు ఓటీఎస్‌ కింద వడ్డీ మాఫీ చేయాలని ప్రతిపాదనలు పంపిస్తే.. ఏదో ఒక నెపంతో తిప్పిపంపించారు. రుణం మాఫీ కథ దేవుడెరుగు.. కనీసం వడ్డీ మాఫీ కూడా చేయని ఈ పెద్దమనుషులు ఈ రోజు మాట్లాడుతున్నారు. 2014–19లో 43 వేల మంది లబ్ధిదారులు అక్షరాలు ఆస్తి పొందాలని అసలు, వడ్డీ కలిపి రూ.15.29 కోట్లు చెల్లిస్తే.. గత ప్రభుత్వం ఆ చెల్లించిన ఆ 43 వేల మందికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఇచ్చారని గట్టిగా నిలదీయండి. డబ్బులు కట్టించుకొని మరీ వారికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఇవ్వని ఇలాంటి పెద్ద మనుషులు ఈరోజు మాట్లాడుతున్నారు. పేదవాడికి మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని కడుపుమంట ఉందో అర్థం చేసుకోండి. 

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అని నా పేరుతోనే ఒక పథకం తీసుకువచ్చాం. లబ్ధిదారులందరికీ నామమాత్రపు ధరతో అక్షరాల రూ.16వేల కోట్ల మేలు చేసే కార్యక్రమం చేస్తుంటే వీరంతా మాట్లాడుతున్నారు. ఈ 30 నెలల కాలంలోనే మీ జగనన్న ప్రభుత్వం.. ఎటువంటి మధ్యవర్తి, నాయకుడు, లంచాలకు, వివక్షకు తావులేకుండా కేవలం డీబీటీ ద్వారా అక్షరాల రూ.1.16 లక్షల కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇంత మంచి చేసిన మీ జగనన్న.. మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని అనుకుంటాడా అని మంచి జీర్ణించుకోలేని పెద్దమనుషులకు అర్థమయ్యేలా చెప్పమని ప్రజలను కోరుతున్నా. దేవుడి దయతో మంచి పథకాన్ని తీసుకువచ్చాం. ఎవరూ కూడా మిస్‌ కాకూడదని ప్రతి వలంటీర్‌ను విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సంపూర్ణ గృహ హక్కు గురించి అర్థమయ్యేలా చెప్పండి. ఈ పథకం ద్వారా ప్రజలకు మంచి జరగాలి. 52 లక్షల మందికి అక్షరాల రూ.1.58 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తిని వారి చేతుల్లో పెట్టడానికి వీలు రావాలి. 

పేదలపాలిట శత్రువులను గట్టిగా అడగండి.. పేదలంటే మీకు ఎందుకయ్యా మీకంత వివక్ష.. పేదలంటే మీకెందుకయ్యా అంత కడుపుమంట. మీ పిల్లలేమో ఇంగ్లిష్‌ మీడియం బడుల్లో చదవొచ్చు.. మా పిల్లలెమో.. తెలుగు మీడియం బడుల్లో చదవాలని మీరు ఆరాటపడటం కరెక్టేనా..? గట్టిగా నిలదీయండి. పేదలంటే వ్యతిరేకంగా ఉన్న ఇలాంటి పెద్ద మనుషులను అడగండి.. మా జగనన్న 31 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు మంచి చేయడానికి ఇస్తే.. మీరు కోర్టులకు వెళ్లి మాకు ఎక్కడ ఇళ్ల పట్టాలు వస్తాయోనని అడ్డుకోవడం ధర్మమేనా అని గట్టిగా నిలదీస్తూ అడగండి. 

కొన్ని కొన్ని విషయాలు బాధ కలిగిస్తాయి. ఇదే పెద్ద మనుషులు రాజధానిలో అమరావతి అని చెప్పుకుంటున్నారు.  రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే.. ఏకంగా కోర్టుకు వెళ్లి.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోగ్రఫిక్‌ ఇమ్‌బ్యాలెన్స్‌ వస్తుందని పిటీషన్‌ వేశారు. ఇలాంటి పెద్ద మనుషుల మధ్యలో పేదవాడు నివసిస్తే.. సామాజిక సమతూల్యం పోతుందని పిటీషన్‌ వేశారంటే..వీరికి పేదవారంటే ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోండి. 

ఇదే పథకానికి ఉగాది నాటి వరకు పొడిగిస్తున్నాం. 52 లక్షల మందికి మంచి జరగాలి. స్వచ్ఛందంగా పథకాన్ని అమలు చేస్తున్నాం. అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో ఏప్రిల్‌ 2వ తేదీ వరకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని పొడిగిస్తున్నాం. జరిగే మంచిని పొందండి అని విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

తాజా వీడియోలు

Back to Top