ఈ ముగ్గురి ధైర్య సాహసాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి

పారా ఒలంపిక్స్ పతకధారులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందనలు
 

అమరావతి: టోక్యో పారా ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు భవీనాబెన్‌(మహిళల టేబుల్ టెన్నిస్‌లో రజతం), నిషద్‌ కూమార్‌(పురుషుల హై జంప్‌లో రజతం), వినోద్‌ కూమార్‌(పురుషుల డిస్కస్‌ త్రోలో కాంస్యం)లకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వీరు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమన్నారు. ఈ ముగ్గురు భరతమాత ముద్దు బిడ్డల ధైర్య సాహసాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, వీరు సాధించిన పతకాలు దేశం యావత్తుకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.

Back to Top