గొప్ప‌ ఆశయంతో  జగనన్న చేదోడు పథకం అమ‌లు

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

గత ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం అర్హులైన వారిని తగ్గించం

  సిఫార్సులు లేకుండా అర్హులను వెతికి పట్టుకుని మరి వారికి లబ్ది 

జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన మంత్రి చెల్లుబోయిన

విజయవాడ: ఒక గొప్ప ఆశయంతో ఈ రోజు జగనన్న చేదోడు పథకాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్నార‌ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. బీసీ శాఖ మంత్రిగా జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించడానికి త‌న‌కు అవకాశం రావటం ఆనందంగా ఉందని  చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు.  వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మానిఫేస్టోలో పెట్టిన ఈ పథకం ఈ రోజు నుంచి అమలు కానుంద‌ని చెప్పారు.  మంగళవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రితో పాటు ఐఏస్‌ అధికారి ప్రవీణ్‌ కమార్‌లు, ఏపీ నాయీ బ్రహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఏనాదయ్య తదితరులు జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... అర్హులైన ల‌బ్దిదారులకు అన్ని పథకాలు అందజేస్తామన్నారు. మొదటి విడతగా 2,47,040 మందికి ఈ పథకానికి అర్హులుగా గుర్తించి వారికి 247.04 కోట్ల రూపాయలు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలాగా తమ ప్రభుత్వం అర్హులైన వారిని తగ్గించమని, జగనన్న చేదోడు పథకం ద్వారా మొదటి విడతలో 2,47,040 మంది లబ్ధి పొందారని చెప్పారు. ఇవాళ 51,390 మంది లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఈ పథకంలో ఎటువంటి సిఫార్సులు లేకుండా కేవలం అర్హులను వెతికి పట్టుకుని మరి వారికి లబ్ది చేకూర్చుతామని చెప్పారు. 

బీసీలను బ్యాక్ వర్డ్ క్లాస్‌గా చూసే రోజుల నుంచి బీసీ అంటే బ్యాక్ బోన్ క్లాస్‌గా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. ఆయన సీఎం అయ్యాక 139 కులాలకు 56 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి ముందుకు న‌డిపిస్తున్నార‌న్నారు. గడిచిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని నిరారోగ్యశ్రీగా మార్చేశారని పేర్కొన్నారు. వైయ‌స్‌ జగన్‌ సీఎం అయ్యాక మళ్ళీ ఆరోగ్యశ్రీని 221 జబ్బులకు వర్తింప చేసి, మన రాష్ట్రాంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ అమలయ్యేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టాన్ని అయిన భరించి సంక్షోభంలో... సంక్షేమం అమలు చేస్తున్న నాయకుడు సీఎం వైయ‌స్‌ జగన్ అన్నారు. 

అప్లై చేసిన అర్హులందరికి ఈ పథకం అమలు: ఐఏఎస్‌ ప్రవీణ్ కుమార్   
వైయ‌స్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గడిచిన ఏడాదిన్నర కాలంలోనే 90శాతం హామీలు అమలు చేశారని, దేశ చరిత్రలోనే అప్లై చేసిన అర్హులందరికి ఈ పథకం అమలు చేసిన ఘనత సీఎం వైయ‌స్‌ జగన్‌ది అని ఐఏఎస్‌ ప్రవీణ్ కుమార్  అన్నారు. రజక, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకి ఈ పథకం అమలవుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ది పొందిన వారికి ఏడాదికి 10 వేల చొప్పున 5సంవత్సరాలు 50 వేలు నేరుగా వారి అకౌంట్‌కు జమ అవుతాయన్నారు. 8 కార్పొరేషన్‌ల ద్వారా 51,390  లబ్ధిదారులకు 51.39  కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఏనాదయ్య మాట్లాడుతూ.. దాదాపు 139 బీసీ సబ్ కులాలకు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ప్రాధాన్యత వచ్చిందన్నారు. తెలియని కులాలను కూడా బయటకి తీసి వారిని చైర్మన్, డైరెక్టర్‌లుగా నియమించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని నాయీబ్రహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేర్కొన్నారు.  

తాజా వీడియోలు

Back to Top