బాబు డైవర్షన్ పాలిటిక్స్

రాజు బలవంతుడై రాజ్యాన్ని అదుపులో ఉంచుతూ పరిపాలన చేస్తుంటే దొంగలు, దోపిడీదారులు, అక్రమార్కులు, మోసగాళ్లూ, తీవ్రవాదులు ఒక్కటై సమాజంలో అసహనం పెరిగిపోయిందని ఫిర్యాదులు చేస్తారు అని వందల ఏళ్లక్రితమే వాస్తవాన్ని చెప్పాడు రాజనీతిజ్ఒడైన చాణుక్యుడు. చంద్రబాబు చేస్తున్న హడావిడి చూస్తే అది అక్షరాలా నిజమే అని అర్థం అవుతుంది. టీడీపీ హాయంలో ఒక్కో నాయకుడు చేసిన అవినీతిని, కుంభకోణాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. కోడెల అక్రమాలు, ఫర్చిచర్ దొంగతనాలు, యరపతినేని మైనింగ్ చోరీ, బోండా, చింతమనేనిల ఇసుక మాఫియా, రాజధానిలో రోడ్డు దోపిడీ ఇలా టీడీపీ అవినీతి తవ్వినకొద్దీ బయటకొస్తోంది. ప్రజలతో టీడీపీ ఛీకొట్టించుకుంటోంది. తాజాగా కోడెల, యరపతినేని అక్రమాల గురించి గుంటూరు ప్రజలే బాహాటంగా మాట్లాడుతున్నారు. ఈవిషయంపై ప్రజల చర్చను దారిమళ్లించేందుకు డైవర్ట్ బాబు ఛలో ఆత్మకూరు డ్రామా మొదలు పెట్టాడు. ఇలాంటి డైవర్షన్ దండయాత్రలతో ప్రజలను నమ్మించలేరని చంద్రబాబు ఎప్పుడు తెలుసుకుంటారో??

టీడీపీ హత్యారాజకీయాలు

చంద్రబాబు హయాంలో పల్నాడు ఎప్పుడూ సమస్యాత్మకంగానే ఉండేది. టీడీపీ నేతల దాష్టీకాలకు, నెత్తుటేర్లు పాలించిన చరిత్రలకు ఉదాహరణగా నిలిచేది. బాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఈ ప్రాంతంలో ఎప్పుడూ హత్యారాజకీయాలు రాజ్యమేలేవి. పట్టపగలే దారుణ హత్యలు, లెక్కలేనన్ని మిస్సింగ్ కేసులు నమోదయ్యేవి. టీడీపీ గూండాలు, మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరుల ఆగడాలకు అట్టుడికిపోయిన ప్రాంతం పల్నాడు. బాబు అధికారంలో లేనప్పుడు మాత్రమే ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండేదని పోలీసు అధికారులు కూడా అనేవారంటే వాస్తవాలను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఆ నీలి నీడలనుంచి బయటపడ్డ పల్నాడుపై చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. కుటుంబ తగాదాలను రాజకీయ కక్షలుగా మార్చి రాష్ట్రంలో అశాంతిని రగిలించే కుట్రలు పన్నుతున్నాడు.

వాస్తవాలేంటి??

ఒక కాలనీలో నివసించే బంధువర్గం మధ్య జరిగిన వివాదాన్ని ఫ్యాక్షన్ గొడవలుగా చిత్రించి రాష్ట్రంలో కల్లోలం పుట్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేసారు. ఇందులో భాగంగానే పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రచారం చేయించారు. బాధితులకు పునరావాస శిబిరం అంటూ డ్రామా మొదలుపెట్టారు. వాస్తవాలను వెలికితీసిన పోలీసులు ఆ ప్రాంతంలో 50 కుటుంబాలు నివసిస్తున్నాయని, అక్కడ జరిగింది బంధువుల మధ్య గొడవ అని గుర్తించారు. కానీ చంద్రబాబు మాత్రం 127 కుటుంబాలకు ఆశ్రయం ఇస్తున్నాం అని చెప్పుకొస్తున్నాడు. అంటే కేవలం ప్రభుత్వంపై బురద చల్లేందుకే ఇలాంటి హడావిడిని చంద్రబాబు పుట్టిస్తున్నాడని విచారణలో వెల్లడైంది. గుంటూరులో వైసీపీ బాధితుల శిబిరం అంటూ మొదలెట్టిన డ్రామా గుర్తించి పోలీసులు శిబిరంలో ఉన్న టీడీపీ కార్యకర్తలను స్వస్థలాలకు స్వయంగా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి రియాలిటీషోలతో ప్రజలను భయభ్రంతులకు గురి కాకుండా పోలీస్ శాఖ తక్షణం స్పందించింది. టీడీపీ గూండాలు జిల్లాలో అరాచకాలు, దాడులు చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. నాటకాల రాయళ్లను దగ్గరుండి మరీ ఇళ్లకు పంపిస్తోంది. అయితే దీన్ని కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బాధితులను దగ్గరుండి ఇళ్లకు చేరుస్తున్నా అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. టీడీపీ నీచ రాజకీయాలకు మా గ్రామాలను బలి చేయకండి అంటూ బాబు యాత్రపై తమ నిరసన వ్యక్తం చేసారు ఆత్మకూరు ప్రజలు. అసలు చంద్రబాబు ఆత్మకూరు యాత్రకు వెనుక ఓ సెటింమెంట్ ఉందని కొందరు ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడును అట్టుడుకుతోందన్నట్టు చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేసి, అక్కడికి హడావిడిగా వెళ్లడానికి కారణం ఉందంటున్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆత్మకూరు పర్యటన చేసాక తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతందనే పిచ్చి భ్రమలో చంద్రబాబు ఇలా ఛలో ఆత్మకూరు గొడవను లేవదీసినట్టు తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. పల్నాడులో తెలుగుదేశం అరాచకాలపై నిరసన వ్యక్తం చేస్తూ వైయస్సార్సీపీ నాయకులు సైతం యాత్ర చేపట్టారు.

పల్నాటిని నెత్తుటేరులు పాలించిన చంద్రబాబే మొసలి కన్నీళ్లు కార్చడం చూస్తే మొగుడిని మొట్టి మొగసాల కెక్కినట్టుగా ఉంది. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రంలో అరాచకాలకు పిలుపునిస్తున్నఈ నలభైఏళ్ల అనుభవాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు రాజకీయవేత్తలు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top