చంద్రబాబూ.. ఇంగ్లిష్‌ వచ్చిన వారిని పక్కనబెట్టుకోండి

నా వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారు

బాబు ఎన్ని కుట్రలు చేసినా దడిచేది లేదు

20 రోజుల్లో ఐదేళ్ల జీవితం ఉంది.. ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి

కుట్రలు, కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ డీఎన్‌ఏలోనే ఉంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌

విజయవాడ: తన మాటలను వక్రీకరిస్తూ చంద్రబాబు, ఎల్లోమీడియా దుష్ప్రచారాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇంగ్లిష్‌ వచ్చిన వారిని పక్కనబెట్టుకుంటే మంచిదన్నారు. అశ్వదామ హతహా.. కుంజరహా అన్నట్లుగానే తాను ఓ సదస్సులో మాట్లాడిన ఫుల్‌ స్పీచ్‌లో రెండు పదాలను కట్‌ చేసి ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. చంద్రబాబుకు వాళ్ల వారు బ్రీఫ్డ్‌ చేసినట్లుగా లేరని, గల్లా జయదేవ్‌తో ఎక్స్‌ప్లేయిన్‌ చేయించుకుంటే మంచిదన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పీవీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేశారని, వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా దడిచేది లేదని, మాట తప్పం, మడమ తిప్పం.. పోరాడుతూనే ఉంటామన్నారు. కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు పార్టీ డీఎన్‌ఏలోనే ఉందని ధ్వజమెత్తారు.

బీఫారమ్‌ వెనక్కు తీసుకోమన్న కమ్యూనిస్టు నాయకుడు రామకృష్ణ వ్యాఖ్యలను తాను అంగీకరిస్తున్నానని, కానీ, హోదాను నీరుగార్చి మాట్లాడిన ప్రతి ఒక్కరి బీఫారమ్‌లు వెనక్కు తీసుకునేలా రామకృష్ణ కోరాలని పీవీపీ సూచించారు. తన మాటలను వక్రీకరించి ఇష్టం వచ్చినట్లుగా ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.  ప్రత్యేక ప్యాకేజీ కోసం అసెంబ్లీలో చేసిన తీర్మానం కాపీ, కౌన్సిల్‌లో చేసిన తీర్మానం, ప్రధాని ధన్యవాదాల తీర్మానం, జైట్లీ తీర్మానం, స్పెషల్‌ స్టేటస్‌ రూ. 3.50 కోట్లు ఏముంది, స్పెషల్‌ ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు దశావతారాలు ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు నటన ముందు కమలహాసన్‌ కూడా సరిపోరన్నారు. మైండ్‌గేమ్‌ ఆడుతూ పచ్చమీడియా తన వ్యాఖ్యలు వక్రీకరించి ప్రసారం చేస్తుందని, తానేంటో బెజవాడ ప్రజలకు తెలుసన్నారు. వాళ్లే ఏప్రిల్‌ 11వ తేదీన సమాధానం చెబుతారన్నారు. 

మీడియా ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరపకుండా ప్రతిపక్షంపై బురదజల్లుతుందని పీవీపీ అన్నారు. 2014 మే 19వ తేదీ నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుందన్నారు. గత ఐదేళ్లుగా వేల సార్లు చేసిన నిరసనలు ప్రజలకు తెలుసన్నారు. తొమ్మిదేళ్లుగా వైయస్‌ జగన్‌ పార్టీని బలమైన శక్తిగా మార్చారన్నారు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు సరైన ప్రణాళికతో ముందుకుసాగుతున్నారన్నారు. 

పోటీలు పడి ట్వీట్లు పెట్టడం కాదు.. కాస్త ఇంగ్లిష్‌ నేర్చుకున్నవారిని పక్కనపెట్టుకోవాలని చంద్రబాబుకు సూచించారు. వైయస్‌ జగన్‌ సతీమణి వైయస్‌ భారతమ్మ లెటర్‌ రాసినట్లుగా కొందరు సర్కులేట్‌ చేస్తున్నారని, దానిపై కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. చంద్రబాబు, ఎల్లోమీడియా ఆడుతున్న మైండ్‌గేమ్‌కు బెదిరేది లేదన్నారు. ప్రత్యేక హోదా అంటే జైల్లో పెడతామన్నప్పుడు వామపక్షాలు ఏమయ్యాయి. రామకృష్ణ ఎక్కడున్నారని పీవీపీ ప్రశ్నించారు. హోదా సంజీవనా అని మాట్లాడారు. హోదా కలిగిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయన్నారు. ప్యాకేజీ నా కష్టం అని మాట్లాడిన చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 

ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ జల్లికట్టు తరహాలో ఉద్యమం చేస్తుంటే మనం అడ్డుకున్నాం అని రెండ్రోజుల క్రితం చంద్రబాబే అంగీకరించారన్నారు. ఎలా పడితే అలా మాట్లాడమేనా రాజకీయం అని ప్రశ్నించారు. విలువైన సమయాన్ని మీడియా దుర్వినియోగం చేసిందని, ఈ సమయంలో ప్రజల సమస్యల గురించి ప్రసారాలు చేస్తే బాగుండేదన్నారు. 20 రోజుల్లో ఐదేళ్ల జీవితం గురించి నిర్ణయం తీసుకోబోతున్నామని, ఈ విలువైన సమయంలో ఎవరికి ఓటు వేస్తే జీవితాలు బాగుపడతాయో ఆలోచన చేసుకోవాలన్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top