సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో జోయాలుక్కాస్‌ చైర్మన్ భేటీ

తాడేప‌ల్లి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో జోయాలుక్కాస్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ అలుక్కాస్‌ వర్గిస్‌ జాయ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైయ‌స్‌ జగన్‌తో అలుక్కాస్‌ వర్గిస్‌ జాయ్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో  పెట్టుబడులు, అవకాశాలపై ఇరువురు చ‌ర్చించుకున్నారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సీఎం వివ‌రించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు.ఈ సమావేశంలో జోయాలుక్కాస్‌ సీవోవో హెన్రీ జార్జ్, రవిశంకర్‌ గ్రూప్‌ చైర్మన్‌ కంది రవిశంకర్ పాల్గొన్నారు.

Back to Top