నెల్లూరు: వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వ వేధింపుల పర్వం కొనసాగుతోంది. వైయస్ఆర్‌సీపీ శ్రేణులను, మద్దతుదారులను మాత్రమే కాదు.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సామాన్యులపైనా ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో అక్కడక్కడ అక్రమ కేసులు.. అరెస్టులు.. నిర్బంధాలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని సోషల్ మీడియాలో ప్రశ్నించాడనే కారణంతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతిని కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎండగడుతున్నారు. దీంతో టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి దిగింది. ఈ కేసులో విచారణకి రావాలంటూ వెంకటాచలం పోలీసులు కాకాణికి సమాచారం అందించారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ వైయస్ఆర్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. కడప కోర్టుకు వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వర్రా రవీంద్రారెడ్డిని జిల్లా పోలీసులు అరెస్ట్‌చేసిన సంగతి తెలిసిందే. సీకే దీన్నే పీఎస్‌లో ఉన్న వర్రా రవీంద్రారెడ్డిని.. ఇవాళ కడప కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. వర్రా రవీంద్రారెడ్డిని మాత్రమే కాదు.. ఆయన కుటుంబ సభ్యుల్ని సైతం పీఎస్‌లో అక్రమంగా నిర్బంధించి.. వైయస్ఆర్‌సీపీ నిరసనలతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వర్రాను కలిసేందుకు కుటుంబ సభ్యులు రాగా, పోలీసులు ఓవరాక్షన్ చేశారు. చివరకు ఆందోళనకు దిగడంతో భార్య కళ్యాణిని మాత్రం అనుమతించారు. ఇంటూరిని వదలని పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌కు పోలీసులు వదలడం లేదు. ఏదో ఒక కేసుతో.. వంకతో పీఎస్‌ల చుట్టూ తిప్పుతున్నారు. గత అర్ధరాత్రి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు మీడియా కంట పడకుండా జాగ్రత్త పడిన పోలీసులు. తమకు ఎటువంటి సమాచారం లేకుండా విశాఖ టు టౌన్ నుండి రాజమండ్రి ప్రకాష్ నగర్ స్టేషన్‌కు రవికిరణ్ తరలించారని ఆయన భార్య పేర్కొన్నారు. ఎటువంటి ఫార్మాలిటీస్ లేకుండానే తరలించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఏ కేసు పై రవి కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారో ఎఫ్ఐఆర్ కాపీ కూడా పోలీసులు చూపించడం లేదని రవికిరణ్ భార్య, బంధువులు ఆరోపిస్తున్నారు.