వైయస్‌ఆర్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యం

వైయస్‌ఆర్‌సీపీ వినుకొండ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ: వైయస్‌ఆర్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యమని వైయస్‌ఆర్‌సీపీ వినుకొండ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ వైయస్‌ఆర్‌సీపీ ప్రచార సభలో ఆయన మాట్లాడారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు ఉద్యోగావకాశాలు కలుగతాయన్నారు.సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రమంతట సస్యశ్యామలం అవుతుందన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాల ద్వారా అన్నివర్గాలకు మేలు జరుగుతుందన్నారు.మీ బిడ్డలను బడికి పంపిస్తే అమ్మఒడి పథకం ద్వారా రూ.15వేలు ఇస్తారన్నారు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా మన బిడ్డలను ఉన్నత చదువులను చదివించుకోవచ్చన్నారు.వైయస్‌ జగన్‌తో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top