తిరుపతి: కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.శనివారం శ్రీకాళహస్తి పట్టణంలో సరస్వతి ఆడిటోరియంలో "బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ " కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి అధ్యక్షతన వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ అనే కార్యక్రమాన్ని, చంద్రబాబు మ్యానిఫెస్టో డౌన్‌లోడ్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. `2024 జూన్ నెల నుంచి పథకాలు అందుతాయి అని ప్రమాణం చేశారు ఇప్పటికీ వాటి అమలు అతీగతీ లేదు.ప్రజలను ఆశచూపి, వంచించి మోసం చేశాడు చంద్రబాబు. ఇప్పటి వరకు చంద్రబాబు 90వేల కోట్లు హామీలకు ఇవ్వాలి.చంద్రబాబు చేసిన వంచనకు గుర్తు చేయడమే.. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.ఎంత దుర్మార్గ పరిస్థితులు శ్రీకాళహస్తి లో ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం చాలా చైతన్యవంతులు ఉన్న ప్రాంతం, అణగ తొక్కితే పులుల్లా తిరగబడతారు.ఇప్పుడున్న కూటమి నాయకులు అంత పేపర్ టైగర్లు స్టేట్ మెంట్లు ఇచ్చే వాళ్ళే.వాళ్ళు రాసే పత్రికల్లో న్యూస్ క్రికెట్ న్యూస్ తప్ప, మిగిలిన ఏ ఒక్కటి నిజం ఉండదు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు చూసి భయపడుతున్నారా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కొదమ సింహాల తిరగ బడండి.చంద్రబాబు ఇచ్చిన 143 హామీలు అమలు చేయండి అని నిలదీయండి.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసం ఇది అని తెలియచేయండి.మా ఆడబిడ్డ కోట వినుత ను దాడి చేస్తారా అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు???మీ ఆడబిడ్డ హత్య కేసులో ఇరుక్కుంది.. పవన్ కళ్యాణ్ వైపున ఎందుకు ప్రశ్నించలేదు??రాయుడు చెల్లెలు రోదన మీకు ఎందుకు వినిపించడం లేదు.మౌన ముని లా ఎందుకు మారిపోయారు.కూటమి ప్రభుత్వంనీ కూకటి వేళ్ళతో పెకిలించి వేయాలి` భూమన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణం మాట్లాడుతూ..`సొంత డబ్బులతో సేవ చేసిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి సేవలు గుర్తు చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనకే చేతులు ఎత్తేశారు.సుపరిపాలన అంటే ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడమా.కరోనా సమయంలో ప్రజలకు కష్టాలను తీర్చిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలును ఎగ్గొట్టి ప్రజలను మోసం చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు` అని విమర్శించారు . మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు బాగుండాలని మా శత్రువు పార్టీ అయినా కూడా తెలుగుదేశం వారికి మంచి చేశాను కానీ నేడు శ్రీకాళహస్తిలో ఆ పరిస్థితి లేదు. చివరకు తెలుగుదేశం వాళ్ళు ఈరోజు జరుగుతున్న కార్యక్రమం కోసం కట్టిన బ్యానర్లను కూడా చూసి భయపడుతూ మున్సిపల్ అధికారులు ముందు పెట్టుకొని అన్నిటిని తొలగించడం చూస్తుంటే హామీలు అమలు చేయలేదని ప్రజలు వాళ్ల మీద తిరగబడతారని భయం స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీకాళహస్తి మండలం ఎంపేడు గ్రామం లో 45 ఇళ్ళు ధ్వంసం చేశారు.కొత్త ఖండ్రిగ గ్రామంలో 20 కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయి.ఇటువంటి అరాచక పాలన గత చరిత్రలో ఎప్పుడు చూడలేదు.ఈరోజు చేస్తున్న టిడిపి నాయకులు అరాచకాలు కు శ్రీకాళహస్తి లో జగనన్న చెప్పిన 2.0 కంటే డబుల్ ఉంటుంది గుర్తు పెట్టుకోండి.వడ్డీ తో కాదు నేను చక్రవడ్డీ తో సహా చెల్లిస్తా.ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సంస్కారం లేకుండా ఉంది నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది.రెడ్ బుక్ మీరు రాస్తే... నేను బ్లడ్ తో డైరీ రాస్తున్నా. నా కార్యకర్తల జోలికొచ్చిన ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ ఒక్క టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం చేయలేదు.ఒక ఎమ్మెల్యే గా వెయ్యి ఇళ్లు కూల్చివేశావు. శ్రీకాళహస్తి చరిత్రలో ఏ ఒక్క ఎమ్మెల్యే ఇంతటి దారుణాలు చేయలేదు.నేను 20 వేల ఇళ్ల పట్టాలు ఇస్తే నువ్వు 40 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదలకు మంచి చెయ్యాలి..ఇలా ఇల్లు కూల్చడం కాదు.శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 274 కేసులు హత్యాయత్నం, తప్పుడు కేసులు పెట్టారు.ఏ.టి. పి అంటే ఆంధ్రా తమిళనాడు పార్సల్ సర్వీస్ శ్రీకాళహస్తిలో ఇటీవలే మొదలైంది. అన్నారు.పవన్ కల్యాణ్ షూటింగ్ లో బిజీ గా ఉన్నట్లున్నాడు,చంద్రబాబు నాయుడు కు ఆపద వస్తే పవన్ కళ్యాణ్ వస్తాడు.మా బ్యానర్ చూస్తేనే మీరు బయపడిపోతే, సింహం లాంటి జగనన్న 2029లో వస్తే మీ పరిస్థితి ఏంటి.శ్రీకాళహస్తిలో గంజాయి విచ్చల విడిగా అమ్మకాలు పెరిగిపోయాయి అన్నారు. కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఓడూరు గిరిధర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వయ్యాల కృష్ణారెడ్డి,ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,బర్రి సుదర్శన్ రెడ్డి, మాజీ డీసీసీ బ్యాంక్ చైర్మన్ సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, జడ్పిటిసి సంధ్యారాణి, తొట్టంబేడు ఎంపీపీ నిర్మలమ్మ,రేణిగుంట ఎంపీపీ అత్తూరు హరిప్రసాద్ రెడ్డి,ఏర్పేడు మండల ఇన్చార్జ్ గున్నేరీ కిషోర్ రెడ్డి,శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, తొట్టంబేడు మండల అధ్యక్షుడు కోగిల సుబ్రహ్మణ్యం, ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్, రేణిగుంట మండల అధ్యక్షుడు గంగారి రమేష్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సిరాజ్ భాష,ఎక్స్ ఎంపీపీ కోవి చంద్రయ్య నాయుడు, మైనార్టీ సెల్ అధ్యక్షులు పటాన్ ఫరీద్,కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ ఉత్తరాజి శరవణ కుమార్, కంఠ ఉదయ్ కుమార్, గోర ,మాజీ బోర్డు మెంబర్స్ మున్నా రాయల్, బుల్లెట్ జై శ్యామ్ రాయల్,యువజన విభాగం అధ్యక్షుడు శ్రీవారి సురేష్, రేణిగుంట టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్,ఎస్సీ సెల్ అధ్యక్షులు పసల కృష్ణయ్య, డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ శంకరయ్య, కాణిపాకం సురేష్, కొల్లూరు హరి నాయుడు, కామి వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.