బాబు అరెస్ట్ రాష్ట్రానికి శుభపరిణామం

 బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతి

బాప‌ట్ల‌:  చంద్ర‌బాబు అరెస్టు శుభ‌ప‌రిణామ‌మ‌ని బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతి పేర్కొన్నారు. చంద్ర‌బాబు అరెస్టుపై ర‌ఘుప‌తి స్పందించారు.  వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమ‌ర్శించారు.  ఈ పరిస్థితుల్లో, వ్యవస్థల మీద నమ్మకం పోతున్న దశలో.. చంద్రబాబును అరెస్టు చేయడంతో సామాన్య ప్రజలకు కూడా ఇప్పుడు వ్యవస్థలపై నమ్మకం కలుగుతుంద‌న్నారు.  ఇంతకాలం తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడు చంద్రబాబు అని ధ్వ‌జ‌మెత్తారు.  నిజం నిలకడ మీద అయినా బయటకు వస్తుంది... అన్నట్టు చంద్రబాబు  స్కిల్ స్కాములో అడ్డంగా దొరికిపోయాడ‌న్నారు.  చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. ఎంతటివారైనా చట్టం ముందు సమానమే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నది రుజువైంద‌ని వ్యాఖ్యానించారు.  చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఆశ చూపెట్టి.. స్కిల్ డెవలప్ మెంటు పేరుతో రూ. 371 కోట్లు చంద్రబాబు నొక్కేశాడ‌ని ఆరోపించారు.  చంద్రబాబు ఒకరకంగా యువతను మోసం చేశాడు. మరోరకంగా ప్రజల సొమ్మును దోచేశాడని పేర్కొన్నారు.  ఇన్ని సాక్ష్యాధారాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినా.. పవన్ కల్యాణ్, సీపీఐ నారాయణ లాంటి వాళ్ళు, బాబును సమర్థించడం దారుణమ‌ని ఖండించారు.  వీళ్ళకు చంద్రబాబు నాయుడు ఇచ్చే గిఫ్ట్ లే ముఖ్యమేమో అని అనుమానం వ్య‌క్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top