హామీల అమ‌లులో కూట‌మి ప్ర‌భుత్వం విఫ‌లం

వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్ర‌హం

బాప‌ట్ల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి స‌మావేశం

బాప‌ట్ల‌:  ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో కూట‌మి ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 16 నెల‌ల కూట‌మి పాల‌న‌లో ఏ ఒక్క వ‌ర్గం కూడా సంతోషంగా లేద‌ని విమ‌ర్శించారు. సోమ‌వారం బాపట్ల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో బాపట్ల పార్లమెంటు పరిశీలకులు ఎమ్మెల్సీ తుమ్మాటి మాధవరావు, అద్దంకి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్. చింతలపూడి అశోక్ కుమార్, చీరాల  సమన్వయకర్త  కరుణం వెంకటేష్, పర్చూరు సమన్వయకర్త గాదె మధుసూదన్ రెడ్డి, రేపల్లె సమన్వయకర్త ఈవూరు గణేష్, వేమూరు సమన్వయకర్త వరికుట్టి అశోక్ బాబు, రాష్ట్ర కార్యదర్శులు చేజర్ల నారాయణరెడ్డి, మోదుగుల బసవ పున్నారెడ్డి, కె.వి.ప్రసాద్, మదన మోహన్ గౌడ్,, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వజ్ర భాస్కర్ రెడ్డి,  అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..`కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోయింది.  ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను, కార్యకర్తలను, సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌ను పోలీసులతో అడ్డుకోలేరు. భయపెడదామని అనుకుంటే కుదరదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు.  పోలీసులను అడ్డుపెట్టుకోవడంతోనే కూటమి పతనం మొదలైంది. రాష్ట్రమంతా మార్పు మొదలైంది.  కూటమి ప్రభుత్వం అరాచకాలు ప్రజలు తెలుసని.. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి  బుద్ధి చెబుతారు` అని వైవీ సుబ్బారెడ్డి హెచ్చ‌రించారు.

Back to Top