చంద్రబాబు టెంపరరీ సీఎం...వైయస్‌ జగన్‌ పర్మినెంట్‌ సీఎం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా..

అమరావతి: ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి గాని పర్మినెంట్‌ ఇల్లు గాని, ఆఫీస్‌ గాని లేదని.. వైయస్‌జగన్‌ మోహన్‌రెడ్డికి మాత్రమే పర్మినెంట్‌ ఇల్లు, వైయస్‌ఆర్‌సీపీకి పర్మినెంట్‌ కార్యాలయం ఉందన్నారు.ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడారు. జగన్‌ రాజధానికి వ్యతిరేకమన్న టీడీపీ నేతలకు చెంపపెట్టు అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.చంద్రబాబుకు ఏపీలో ఓటులేదు..ఆఫీస్‌ లేదు..సొంత ఇల్లు లేదని ఎద్దేవా చేశారు.వైయస్‌ జగన్‌కు చిత్తశుద్ధి ఉంది కాబట్టే రాజధానిలో సొంత ఇల్లు, పర్మినెంట్‌ ఆఫీస్‌ కట్టారన్నారు.చంద్రబాబు టెంపరరీ సీఎం అని..వైయస్‌ జగన్‌ పర్మినెంట్‌ సీఎం అని అన్నారు.చంద్రబాబు జౌట్‌ గోయింట్‌ సీఎం..వైయస్‌ జగన్‌ అప్‌కమింగ్‌ సీఎం అని అన్నారు.చంద్రబాబు ఓడిపోతారని తెలిసే..హైదరాబాద్‌లో ఇల్లు కుట్టుకున్నారన్నారు.ప్రజలకు దగ్గరగా ఉండి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాశ్వత పరిష్కారాలు చూపిస్తారని తెలిపారు.

Back to Top