అగ్రిగోల్డ్‌ ఆస్తులను దోచుకోవడానికి చంద్రబాబు కుట్రలు

అగ్రిగోల్డ్‌ ఆస్తులను దోచుకోవాలనే ఉద్దేశ్యం చంద్ర‌బాబుది

 

అగ్రిగోల్డ్‌కు ఎంతో విలువైన భూములున్న బాధితులకు న్యాయం జరగడంలేదు

విజయవాడ: తీవ్ర నిరాశతో ఉన్న అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసటగా నిలిచేందుకు రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్‌ల ముందు వైయస్‌ఆర్‌సీపీ ధర్నాలు చేపట్టింది.దేశంలోనే అనుభవం ఉన్న సీనియర్‌ నాయకుడుగా గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు అగ్రిగోల్డ్‌ సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపించడం అశ్చర్యకరంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ నేత కొలుసు పార్థసారధి అన్నారు.అగ్రిగోల్డ్‌ ఆస్తులను దోచుకోవాలనే ఉద్దేశ్యంతో సమస్య పరిష్కారం చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తుందని విమర్శించారు.ప్రభుత్వం కుట్ర ఉందన్నారు.

అగ్రిగోల్డ్‌కు ఎంతో విలువైన భూములున్న బాధితులకు న్యాయం జరగడంలేదన్నారు.హాయ్‌ల్యాండ్  అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తి అని రాష్ట్రంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరుకు అందరికి తెలుసునని, కాని దీని వెనక టీడీపీ ప్రభుత్వ నేతలు హాయ్‌ల్యాండ్‌ అగ్రిగోల్డ్‌కు సంబంధించినది కాదని చెప్పించడం దారుణమన్నారు.తమ విలాసాలకు, ప్రైవేటు కార్యక్రమాలకు వందల కోట్లు దుర్వినియోగం చేసే చంద్రబాబు కేవలం 1150కోట్లు రూపాయాలు బాధితులకు ఇచ్చినట్లయితే 60 లక్షల మంది ఊరట చెందుతారన్నారు.చంద్రబాబుకు అటువంటి ఆలోచన లేకుండా అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేయడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top