‘సీఎం కప్ పేరుతో ‍ క్రీడలు నిర్వహిస్తాం’

తిరుమల: సీఎం కప్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించేలా క్రీడలు నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన శనివారం తిరుమల శీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో క్రీడలు నిర్వహించి ఫైనల్‌ను విజయవాడ లేదా వైజాగ్‌లో నిర్వహిస్తామని అవంతి పేర్కొన్నారు. 

పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతి అందచేస్తామని ఆయన తెలిపారు. ప్రైజ్‌మనీ కింద మొదటి బహుమతి రూ. 5 లక్షలు, రెండవ బహుమతి రూ. 2 లక్షలు, మూడవ బహుమతి రూ. 1 లక్ష  క్రీడకారులకు అందచేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు.
 

తాజా వీడియోలు

Back to Top