విష జ్వరాల కట్టడికి పటిష్ట చర్యలు 

మంత్రి విడదల రజనీ
 

అమ‌రావ‌తి: విష జ్వరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నామ‌ని మంత్రి విడదల రజనీ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం  ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో స‌భ్యుల ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం చెప్పారు.   వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. విష జ్వరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాం. డెంగ్యూ, మలేరియాను ఆరోగ్య శ్రీలో చేర్చాం.  ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో డబ్బులు దుబారా చేశారు. 

మా ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నాం. విషజ్వరాలపై అవగాహన కల్పిస్తున్నాం. వెక్టార్ కంట్రోల్ యాప్ తో అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. నాతో సహా అధికారులు రివ్యూ చేస్తున్నాం. పంచాయ‌తీ రాజ్ అధికారులతో రివ్యూ చేశాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కోసం క్యాంపులు నిర్వహించాం. విషజ్వరాలపై ధైర్యంగా పోరాడుతున్నాం. సంధ్య మరణం కలచి వేసింది. ఇది బాధాకరం. సంధ్య తండ్రి కూడా అనారోగ్యంతో భద్రాచలంలో ఆస్పత్రిలో చేరారు. సంధ్యకు జ్వరం పెరగడం, ప్లేట్ లెట్స్ బాగున్నాయి. తండ్రీ కూతురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చింతూరు ఆస్పత్రికి సంధ్యను మళ్ళీ జాయిన్ చేశారు. సంధ్యకు బాగా లేకపోవడంతో సంధ్య మరణించింది. చిన్నారి మృతిని టీడీపీ సభ్యులు రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నార‌ని మంత్రి మండిప‌డ్డారు.   

వైద్యరంగానికి రూ.16వేల కోట్లు వ్యయం-మంత్రి రజని

నాడు నేడు కింద వైయస్జ గన్ పాలనలో వైద్యరంగంలో ఇన్ ఫ్ర్రాస్ట్రక్చర్ అందచేస్తున్నామని మంత్రి రజని తెలిపారు. అర్బన్ హెల్త్ ని నవీకరిస్తున్నాం. 344 యుపీహెచ్ లు కొత్తగా నిర్మిస్తున్నాం. ఇందుకోసం 399 కోట్లు ఖర్చుచేస్తున్నాం. పీహెచ్ సీలను 977 ..407 కోట్లతో ఆధునీకరిస్తున్నాం. వందలాది పీహెచ్ సీలకు కొత్త రూపు తెస్తున్నాం. 670 కోట్లు పీహెచ్ సీలకు ఖర్చుపెడుతున్నాం. సెకండరీ హెల్త్ మార్చేస్తున్నాం. 528 కోట్లతో సీహెచ్ సీలకు ఆధునీకరణ చేస్తున్నాం. 1223 కోట్లు వైద్యరంగం గురించి ఖర్చుచేస్తున్నాం. పార్లమెంట్ సీటు పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయబోతున్నాం. 17 మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. 16 కాలేజీలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశాం. చంద్రబాబు హయాంలో కొత్త మెడికల్ కాలేజీ పెట్టలేదు. టీడీపీ-బీజేపీ పొత్తు వున్నా ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదని మంత్రి విడదల రజని గుర్తు చేశారు.

తాజా వీడియోలు

Back to Top