ఏపీఐడీసీ చైర్‌ప‌ర్స‌న్‌గా బండి పుణ్య‌శీల బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్  కార్పొరేషన్(ఏపీఐడీసీ) ఛైర్ పర్సన్ గా నియమితులైన  బండి నాగేంద్ర పుణ్యశీల  ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమం గురువారం ఘ‌నంగా నిర్వ‌హించారు. తాడేపల్లిలోని ఏ పి ఐ డి సి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆమె ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు  ,ఎమ్యెల్సీ కరీమున్నిసా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి , మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ,ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతంరెడ్డి ,ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మొండితోక అరుణ్ కుమార్, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కనకారావు, రెల్లి కార్పొరేషన్ ఛైర్మన్ మధుసూదన్ రావు,  గ్రంధాలయం ఛైర్ పర్సన్ జమల పూర్ణమ్మ,  వైయ‌స్ఆర్‌సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, కార్పొరేటర్లు,నాయకులు తదితరులు పాల్గొని పుణ్యశీలకు శుభాకాంక్షలు తెలిపి శాలువతో సన్మానించారు. 

Back to Top