వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైత్ర‌యాత్ర‌

నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రారంభం
 
అన్ని చోట్ల అధికార పార్టీ ఆధిక్యం

కమలాపురం మునిసిపాలిటీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ కైవసం

అమరావతి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మొద‌లైంది. ఆయా మునిసిపాలిటీల్లో 325 డివిజన్లు, వార్డులకు సోమవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 325 స్థానాలకు 1,206 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. మొత్తం 23 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇక సోమవారం జరిగిన పోలింగ్‌లో 8,62,066 మందికిగాను 5,14,086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి అధికార పార్టీ అన్ని చోట్ల ఆధిక్య‌త క‌న‌బ‌రుస్తోంది. కమలాపురం మునిసిపాలిటీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 

 చిత్తూరు జిల్లా 
►కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్‌లో వైయ‌స్సార్‌సీపీ అభ్యర్థుల ఆధిక్యంలో ఉన్నారు.
►14వ వార్డు వైయ‌స్ఆర్సీపీ అభ్యర్థి మునిస్వామి ఏకగ్రీవ ఎన్నిక
►నగిరి మున్సిపాలిటీ 17వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గంగాధరం ఏకగ్రీవం 

 

తాజా ఫోటోలు

Back to Top