రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ప్రభుత్వమే బాధ్యత 

వెంట‌నే స్పందించిన ప్రభుత్వ యంత్రాగానికి మంత్రి అభినంద‌న‌లు

విజయనగరం: రైలు ప్రమాదం ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని  బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వ యంత్రాగాన్ని అభినందించారు. 

 
 ఘటన దురదృష్టకరం. బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. వాళ్ల కుటుంబాలకు అండగా ఉంటుంది. ప్రమాదంలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. అలాగే తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ.2 లక్షలు, సాధారణ గాయాలైన వాళ్లకు రూ.50 వేల సాయం  అందిస్తాము’’ అని మంత్రి బొత్స తెలిపారు.

ఏపీ ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిందని, సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొందని అభినందించారు. ఏపీ అధికారులు రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నారని తెలిపారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల పునరుద్ధరణ పనులను కూడా రైల్వే అధికారులు ప్రారంభించారని.. సాయంత్రంలోపే పూర్తవుతాయని మంత్రి బొత్స మీడియాకు వివరించారు. 

 

Back to Top