ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు

స‌చివాల‌యం: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు కృతజ్ఙతలు తెలిపారు. దాదాపు 25 సంవ‌త్స‌రాలుగా ప్రమోషన్లు లేక ఇబ్బంది పడుతున్న ఎంపీడీవోల సీనియారిటీ సమస్యలు పరిష్కరించి, కొత్తగా 51 డీఎల్‌డీవో పోస్టులు మంజూరు చేసి 250 మందికి పైగా ప్ర‌భుత్వం ప్రమోషన్లు కల్పించింది. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటుచేసిన 26 డివిజన్లలో 26 డీఎల్‌డీవో పోస్టులు మంజూరు చేయాలని కోరగా అంగీకరించి, క్యాబినెట్‌లో ఆమోదముద్ర తెలిపినందుకు స‌చివాల‌యంలోని సీఎం కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సీఎంను క‌లిసిన వారిలో ఏపీజీఎఫ్‌ ఛైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి, గ్రూప్ -1 అధికారుల సంఘం నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి, మహేష్, భార్గవి తదితరులు ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top