కరోనా పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం మరో రికార్డ్‌

తాడేపల్లి: కరోనా పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం మరో రికార్డు సొంతం చేసుకుంది. కరోనా వైర‌స్ను ఎదుర్కోవడంలో ముందున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ‌.. తాజాగా దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా  నిలిచింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 5,10,318 మందికి కరోనా పరీక్షలు చేశారు. కరోనా పరీక్షలు చేయడంలో దేశంలోనే మొదటిస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నిలిచింది. మిలియన్‌ జనాభాకు 9,557 మందికి ఏపీ ప్రభుత్వం పరీక్షలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఏపీలో రికవరీ రేట్‌ 54.67 శాతానికి పెరిగింది. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే.

Back to Top