నేడు, రేపు సీఎం వైయ‌స్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు (గురువారం, శుక్రవారం)  దేశ రాజధానిలో సీఎం పర్యటించనున్నారు. నేటి సాయంత్రం 6:30 కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు. 

అదే విధంగా శుక్రవారం ఉదయం విజ్ఞాన్‌ భవన్‌లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరుగుతున్న సదస్సులో సీఎం పాల్గొననున్నారు. రేపు రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైయ‌స్‌ జగన్‌ సమావేశం కానున్నారు.

Back to Top