మాణిక్యాలరావు మృతిపట్ల సీఎం వైయ‌స్‌‌ జగన్ దిగ్భ్రాంతి

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు 

 తాడేప‌ల్లి: మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత పైడికొండల మాణిక్యాలరావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. మాజీ మంత్రికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు. కాగా కరోనా బారినపడిన మాణిక్యాలరావు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top