తాడేపల్లి : మాండూస్ తుపాను, భారీ వర్షాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్షా సమావేశం ఉండనుంది. ఈ సమీక్షకు సంబంధిత శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే.. తుపాను ప్రభావం మొదలుకాక ముందు నుంచి.. తుపాను మొదలయ్యాక ఆయన నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు అండగా నిలవాలని, అవసరమైతే పునరావాసాలపై దృష్టి సారించాలని ఆయన జిల్లా కలెక్టర్లను, అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు.