తాడేపల్లి: పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నీలి బెండపూడికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వైజాగ్ ఆంధ్ర యూనివర్శిటీ పూర్వవిద్యార్థి అయిన నీలి బెండపూడి.. ప్రతిష్టాత్మకపెన్సిల్వేనియా యూనివర్శిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులవ్వడం గర్వకారణమని సీఎం వైయస్ జగన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ నీలి బెండపూడి అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. విశాఖపట్నంలో జన్మించి, ఉన్నత చదువుల కోసం 1986లో అమెరికాకు వెళ్లిన ఆమె ప్రస్తుతం కెంటకీలోని లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గానూ, ప్రెసిడెంట్‌గానూ విధులు నిర్వర్తిస్తున్నారు.