ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్  

తాడేప‌ల్లి: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  వినమ్రంగా బదులిచ్చారు. ఎంతో మంచి మనసుతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. "మీ సందేశాలు చదువుతుంటే నాకెంతో ఆశీర్వాద బలం ఉందన్న విషయం స్పష్టమైంది. ప్రతి రోజు మరింత మెరుగ్గా పాలన అందించేందుకు, మరింత శ్రమించేందుకు  మీ ప్రేమ, మీ మద్దతు నాకు బలాన్నిస్తున్నాయి" అని వైయ‌స్ జ‌గ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు.

I thank each and every one of you for your thoughtful and kind wishes. Reading your messages reminded me how incredibly blessed I am. Your love & support gives me strength to work harder and be better each day. Folded hands

Back to Top