నేడు సీఎం వైయ‌స్ జగన్‌ చేతుల మీదుగా ఆహార శుద్ధి పరిశ్రమల ప్రారంభం 

 గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడనుంది. బుధవారం ఆహార శుద్ధి పరిశ్రమలను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.  
మొత్తం 13 ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ.2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అలాగే.. 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుంది. ఏడు ప్రాజెక్టులకు భూమి పూజతో పాటు మరో ఆరు ప్రాజెక్టులను సీఎం వైయ‌స్ జగన్‌ ప్రారంభించనున్నారు.  

Back to Top