నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ హెచ్చరించారు. టీడీపీ నేత పట్టాభి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేత నారా లోకేశ్ కు మంత్రి సవాల్ విసిరారు. 'దమ్ముంటే చూసుకుందాం రా' అంటూ ఛాలెంజ్ చేశారు. సీఎం వైయస్ జగన్ ని తిట్టిస్తే ఊరుకుంటామా? అని అనిల్ మండిపడ్డారు. తాము చేతికి గాజులు తొడుక్కోలేదని అన్నారు. మీరు చిత్తూరు జిల్లాలోనే పుట్టుంటే... రా చూసుకుందామని అన్నారు. తాను వారం రోజులు నెల్లూరులోనే ఉంటానని... ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. ఎవరొచ్చినా సరేనని... కాన్వాయ్ ని కూడా పక్కన పెట్టి వస్తానని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను దారుణంగా తిట్టిన విషయం జనసేనాని పవన్ కల్యాణ్ కు తెలియదా? అని ప్రశ్నించారు. వైయస్ జగన్ ఫ్యాక్షనిస్ట్ అయితే మీరు ఉండగలరా? అని అడిగారు. వైయస్ఆర్ సీపీ కార్యకర్తలను ఎవరు తాకినా చూస్తూ ఊరుకోబోమని మంత్రి హెచ్చరించారు.