శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ "సామాజిక న్యాయ భేరి" శ్రీకాకుళం నుంచి మొదలైంది. సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు నాంది పలికారు. జగన్ గారికి ఉన్న విశాల దృక్ఫథం వల్లే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం బదిలీ జరిగింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు, నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే సామాజిక భేరి బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ గారి కేబినెట్ లోని మొత్తం 25 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు పాల్గొంటున్నారు. గ్రామ స్థాయి వాలంటీర్ నుంచి రాజ్యసభ సభ్యుల వరకు ఎక్కడ చూసినా, చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది అని ఈ సందర్భంగా మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు చాటి చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రంలోనూ జరగనంత సామాజిక న్యాయం జగన్ గారి వల్ల, జగన్ గారి చేత, పేద వర్గాలన్నింటి కోసం జరిగిందని వారు కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్ గారి వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యాపరంగా సామాజిక న్యాయం జరుగుతుందని, దేశానికే ఇది మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్ల పాలన సాగించింది. ఈ మూడేళ్లలో తీసుకువచ్చిన ప్రధానమైన మార్పు ఏమిటి అనేది చెప్పడానికే ఈ సామాజికి న్యాయ భేరి బస్సు యాత్రను ప్రారంభించాం. దేశంలో స్వాతంత్ర్యం రాకముందు, బ్రిటిష్ వాళ్లు రాకముందు సామాజిక న్యాయం అనే అంశం మీద రకరకాల ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. బ్రిటిష్ వాళ్ల పాలనలోనూ, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంతమందికి ఇతర వర్గాలకు వీలు కల్పించాలనే ఆలోచన, ఆనాడే ఉద్యమకారులు చేసిన ఉద్యమాలు వల్ల కొద్దొగొప్పో మార్పు వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చాక, రాజ్యాంగం అమలులోకి వచ్చాక బీసీ, మైనార్టీ వర్గాలను ప్రత్యేకంగా ఎక్కడా పేర్కొనలేదు. రాజ్యాంగంలో ఒక్క ఆర్టికల్‌లో మాత్రం రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో ఉండే వెనుకబడిన వర్గాలను, మైనార్టీ వర్గాలను అభివృద్ధి చేసుకోవాలనే ప్రొవిజన్‌ను కల్పించారు. ఈ వర్గాలు తాము కూడా పాలనలో భాగస్వామ్యులు కావాలనే వాదన ఇవాళ్టిది కాదు. అన్నిస్థాయిల్లో ఈ ఆవేదన ఈ వర్గాల్లో ఉంది. ఉద్యమాలు, ఆందోళనలు రావడంతో చిన్న చిన్న అవకాశాలు కల్పించారు. పాలనలో సామాజిక న్యాయం ఏపీలోనే మొదలైంది కానీ, పాలనలో అవకాశం అనేది ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు కల్పించారు. మంత్రివర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించి ఆయా వర్గాల చిరకాల వాంఛను నెరవేర్చారు. ఎక్కడైనా రాజకీయ అధికారం లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదు. రాజకీయ అధికారంతోపాటు, విద్య, ఇతరత్రా అంశాలన్నింటినీ అందించినప్పుడే వెనుకబడిన వర్గాలు సామాజిక న్యాయం పొందుతాయని ముఖ్యమంత్రి గారు గమనించి రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. ఎవరు అడగకపోయినా, ఉద్యమాలు చేయకపోయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తానంతట తానుగా విశాల భావజాలాన్ని, దృక్పథాన్ని అమర్చుకుని సామాజిక న్యాయాన్ని అమలు చేశారు. ఈ క్రెడిట్ అంతా జగన్ మోహన్ రెడ్డిగారికి చెందుతుంది. డీబీటీని హేళన చేయడం అంటే ఆ వర్గాలను కించపరిచినట్టే.. సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు అందుతోంది. ఆ డబ్బులన్నీ 82 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నేరుగా డీబీటీ ద్వారా వెళుతోంది. ఇది ఎప్పుడైనా గమనించారా? గతంలో ఎప్పుడైనా ఇంత పెద్ద మొత్తం బీసీలకు పంచిపెట్టే కార్యక్రమం జరిగిందా? పంచిపెట్టడం అనేది ఒక హేళన మాటగా కొంతమంది మాట్లాడుతున్నారు. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కించపరిచినట్లే అని భావిస్తున్నాం. రాజ్యాంగం ఉంటే సరిపోదు, దాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కావాలి. అటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారి రూపంలో ఇవాళ లభించారని రాష్ట్రమంతా తిరిగి మేము చెప్పదలచుకున్నాం. నేడు ఎవరి వద్ద తల వంచాల్సిన పనిలేదు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందుకునేందుకు లబ్ధిదారులు ఎవరి వద్దనైనా తలొంచే అవసరమే లేదు. ఇది మార్పు అని మేము చెప్పదలచుకున్నాం. బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతా తిరిగారు, కానీ ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో అయినా ఒక్క రూపాయి అవినీతి జరుగుతుందని ఆరోపణ చేయలేకపోయారు. ఎందుకంటే, అంత పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. రాష్ట్రానికి సమకూరిన ఆర్థిక వనరులు పంపిణీ చేయడంలో 82 శాతం బడుగులు, వెనుకబడిన వర్గాలకు చేరుతుంది. ఇదీ పరిపాలన, ఇదీ మార్పు అంటే.. ఇది మార్పు కాదా చంద్రబాబుగారూ? ఇది మీకు కనిపించలేదా? మీరు గమనించలేదా? సామాన్యుడికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు అవినీతికి తావులేకుండా అందుతున్నాయని సగర్వంగా చెప్పగలం. ఇదీ పాలన, ఇదీ మార్పు అని మేము చెప్పగలం. కేవలం మంత్రి పదవులే కాకుండా, అనేక పదవుల్లో 50 శాతం పదవులను వెనుకబడినవర్గాలకు అందించారు. ఇదే సామాజిక న్యాయం అంటే. సామాజిక న్యాయం అంటే. గతంలో మాదిరిగా కొద్దిమందిని మంత్రులను చేయడమో, కొంతమందికి పదవులు ఇవ్వడంలోనో రాదు. సామాజిక న్యాయం అన్ని స్థాయిల్లో అమలు చేసే కార్యక్రమం వైయస్సార్ సీపీ ప్రభుత్వంలోనే జరిగింది. ఈ మార్పు అనేది పాలితులుగా ఉన్నవాళ్లు పాలకులుగా మారినవాళ్లు ప్రజలకు చేరవేయాలి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నాలుగు బహిరంగ సభల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకువచ్చిన మార్పులు, ఖర్చు పెట్టిన మొత్తాలు, చేరవేసిన వర్గాలను అన్నింటినీ చూపిస్తాం. - ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు వెనుకబడినవర్గాలకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దుర్వినియోగం అవుతున్నట్లు భావిస్తున్నారా? వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పాలనలో వారిని భాగస్వామ్యం చేసి, పాలనలో మాది భాగం ఉంది అనేలా చేసేది మార్పు కాదా? దీన్ని ప్రజలకు తెలియచేయడానికే ఈ బస్సుయాత్రను ప్రారంభించాం. దేశంలో ఉన్న మెజార్టీ వర్గాలైన వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం రావాలి. దానికి ఆంధ్రప్రదేశ్ నాంది అవుతుందని, అవ్వాలని దానికి ఆద్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని గర్వంగా చెపుతున్నాం. రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి శ్రీ సీదిరి అప్పలరాజుః ఏపీలో సామాజిక సంస్కరణలను ప్రపంచానికి చాటి చెప్పేందుకే యాత్ర. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గొప్ప సంస్కరణలు ప్రపంచానికి చాటి చెప్పడానికి, దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు దీన్ని ఆదర్శంగా తీసుకోవడానికి, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చైతన్యవంతుల్ని చేయడానికి ఈ సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రను ప్రారంభిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మంత్రులు, ఉన్నతమైన రాజకీయ పదవులు పొందిన ప్రజాప్రతినిధులు అంతా ఈ యాత్రను ఆరంభిస్తున్నాం. - స్వాతంత్ర్యం వచ్చాక అనేక చట్టాలను చేసుకుని వాటన్నింటిని రాష్ట్రాలకు అనుగుణంగా అమలు చేసుకుంటున్నాం. వెనుబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక ప్రయోజనాలు చేకూరడం అనేది చాలా తక్కువే. మళ్లీ ఇప్పడు జగన్ మోహన్ రెడ్డిగారు అనే సంఘ సంస్కర్త కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఒరవడితోపాటు, చట్టాలను రీవిజిట్ చేసింది. కేబినెట్ కూర్పు నుంచి చిన్న చిన్న పదవుల వరకూ వెనుకబడినవర్గాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చి ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చి సమసమాజ స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రిగారు పనిచేస్తున్నారు. - దేశంలో ఇలాంటి స్ఫూర్తి ఎక్కడా కూడా కనపడటం లేదు. మరోవైపు స్త్రీ సమానత్వంపై కూడా పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పించిన ఘనత మన ప్రభుత్వానిదే. మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం ఇది. ఆర్థిక సమానత్వం వచ్చినరోజే సామాజిక సమానత్వం వస్తుందనే భావనతో వాళ్లందరికీ నామినేటెడ్ పదవులు, పనుల్లో రిజర్వేషన్ కల్పించారు. విద్యా, వ్యవసాయ రంగాల్లో కొత్త సంస్కరణలు తీసుకువచ్చి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ స్పూర్తిని ప్రజలందరికీ తెలియచేయాలని, రాష్ట్ర విధానాన్ని దేశమంతా గర్వంగా చూడాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలకు వివరించాలని మంత్రివర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులంతా ఒక కూటమిగా, ఉద్యమంగా, సామాజిక విప్లవం మాదిరి బస్సుయాత్రను మొదలుపెడుతున్నాం.