తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. కమిటీ చైర్మన్ శివశంకరరావుతో కలిసి వెబ్‌సైట్, లోగోను సోమవారం సీఎం ప్రారంభించారు. కాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. కేబినెట్ సమావేశం.. ఈనెల 16న తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రిమండలి సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. సీఎం వైయస్ జగన్ ఆధ్యక్షతను ఈ సమావేశం జరుగనుంది.