అల్లూరి సీతారామరాజు జిల్లా రోడ్డు ప్రమాదం వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి 

 
తాడేప‌ల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు. చింతూరు మండలం తులసిపాకలు ఘాట్‌ రోడ్‌లో యాత్రికుల ప్రైవేట్‌ బస్సు లోయలో పడి పలువురు మృతిచెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

Back to Top