అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదించనుంది. అలాగే పలు కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
- వైయస్ఆర్ చేయూత పై స్టేటస్ నివేదికను క్యాబినెట్ ఆమోదించే అవకాశం వుందని తెలుస్తోంది.
- గ్రేటర్ విశాఖ, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతుల పై ఆమోద ముద్ర వేయనుంది క్యాబినెట్. - నియామకాలు, ప్రమోషన్లలో డిజేబుల్ వ్యక్తులకు 4 శాతం రిజర్వేషన్ కు పచ్చజెండా ఊపనుంది.
- నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ ల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేయనుంది క్యాబినెట్. ఒక్కో అదాలత్ కు 10 పోస్టులను ఆమోదించనుంది మంత్రిమండలి.
- కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ మినహాయింపును ర్యాటీఫై చేయనుంది.
- అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపనుంది.
