సూపర్‌ స్పెషాలిటీ సేవలన్నీ ఒకే చోట..  

కేంద్ర వై ద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్‌ మాండవీయ ప్రశంస

 విశాఖపట్నం : ఆంధ్ర వైద్య కళాశాలలోని కేజీహెచ్‌లో సూపర్‌ స్పె షాలిటీ సేవలన్నీ ఒకే చోట లభించ డం శుభ పరిణామమని కేంద్ర వై ద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్‌ మాండవీయ ప్రశంసించారు. ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్‌ హాల్లో నిర్వహించిన ఆంధ్రా మెడికల్‌ కళాశాల శత దినోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వర్చువల్‌గా హాజరయ్యారు.

ఉత్సవాల్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ జె.నివాస్, కలెక్టర్‌ డా.మల్లికార్జున, డా.వైయ‌స్ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ బాబ్జీ, మధ్యప్రదేశ్‌ ఆయుష్మాన్‌ భారత్‌ ముఖ్య కార్యదర్శి రమేశ్‌కుమార్, సెంటినరీ సెలబ్రేషన్స్‌ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ రవిరాజు  ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో ఏర్పాటు చేస్తున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు  కేంద్ర మంత్రి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు.

అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి వచ్చే వైద్యులకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు.  పీజీ, డిగ్రీలో అధిక మార్కులు సాధించిన వైద్య విద్యార్థులకు మంత్రి రజిని మెడల్స్, అవార్డులు అందజేశారు.  ఎమ్మెల్సీ డా.రవీంద్రబాబు, ఏఎంసీ ప్రిన్సిపల్‌ డా.బుచ్చిరాజు, ఎంపీ డా.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.  

Back to Top