పోలవరం ప్రతీ నీటి బొట్టుపై వైయ‌స్ఆర్‌ అని ఉంటుంది

మంత్రి అంబ‌టి రాంబాబు

అమరావతి: పోలవరం ప్రతీ నీటి బొట్టుపై దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని ఉంటుంద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌ నిర్మాణంపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవలం పూర్తి అయితే ఏపీకి అనేక లాభాలు ఉన్నాయన్నారు.   పోలవరానికి మొదట్లో శ్రీరామపాద సాగర్‌ అని పేరు పెట్టారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌గా మార్చారు. పోలవరం నిండితే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరందిచే అవకాశం ఉంటుంది. ఇరిగేషన్‌ సస్యశ్యామలం చేయాలని ఆనాడు భావించి మహానేత వైయ‌స్ఆర్‌  జలయజ్ఞం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతోపాటు మహానేత వైయ‌స్ఆర్‌ అన్ని అనుమతులు తీసుకువచ్చారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా వైయ‌స్ఆర్ మాత్రమే పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇరిగేషన్‌ను సస్యశ్యామలం చేయాలని జలయజ్ఞం తీసుకువచ్చారు. పోలవరం ప్రతీ నీటి బొట్టుపై వైయ‌స్ఆర్ అని ఉంటుంది. పోలవరం పూర్తి చేసేది మేమే. మా హయాంలోనే పోలవరం పూర్తి అవుతుంది. ఇది దైవ నిర్ణయం. మా ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణానికి సంబంధించిన రూ. 2,600 కోట్ల పెండింగ్‌ నిధులు కేంద్రం నుంచి రావాలి అని స్పష్టం చేశారు.  

మంత్రి అంబ‌టి రాంబాబు ఇంకా ఏమ‌న్నారంటే.. 

  • భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందే ఆంధ్రప్రదేశ్ మద్రాస్ లో కలిసి ఉన్నప్పుడు వెంకటకృష్ణ అనే చీఫ్ ఇంజనీర్...శ్రీరామపాద సాగర్ అనే పేరుతో ఆలోచన చేసారు. తర్వాత అనేక అభ్యంతరాలు, ఆలోచనల అనంతరం కొన్ని మార్పులు చేసి, తగ్గించి దాన్ని 1980లో పోలవరం పేరుతో నామకరణం చేసి 194.6 టీఎంసీలు రిజర్వాయిర్ ఏర్పాటు, లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ ద్వారా నీటిని వ్యవసాయానికి ఇవ్వాలని భావించారు. 
  • 1980లో అంజయ్యగారు శిలాఫలకం మాత్రమే వేసారు. తర్వాత ఎన్నో ఏళ్లు కాగితాల్లో బూజుపట్టి ఉండిపోయిన ప్రాజెక్టును భూమార్గం పట్టించి, అనుమతులన్నీ తెచ్చింది వైయస్సార్. 
  • వైయస్సార్ మృతి తర్వాత వచ్చిన తర్వాత పోలవరం నిర్లక్ష్యానికి గురైంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి విభజన హామీగా జాతీయ ప్రాజెక్టుగా మారి కేంద్రమే పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని చెప్పాడు. 2014 ధరలతో మాత్రమే పోలవరం ఖర్చులు రీయంబర్స్ చేస్తామన్న కేంద్రం మాటలకు గుడ్డి తల ఊపాడు. పోలవరాన్ని ATMలా వాడుకున్నాడు. నేడు ప్రతిపక్షంలో ఉండి పోలవరం 72 శాతం నేనే పూర్తి  చేసానంటూ డప్పు కొడుతున్నాడు. 
  • వాస్తవాలేమిటో ఒక్కసారి చూస్తే...
  • 2014-19లో హెడ్ వర్క్స్ ఎస్టిమేషన్ - 5,943.91 కోట్లు
  • 3,591.86 కోట్లు మాత్రమే వాళ్లు ఖర్చు చేసారు
  • దీని ప్రకారం చూస్తే 60.4% అయినట్టు. 
  • నేటి అంచనా ప్రకారం హెడ్ వర్క్స్ లో 7,422.68 కోట్లు  
  • దీని ప్రకారం చూస్తే 48.3% మాత్రమే హెడ్ వర్క్స్ లో చంద్రబాబు హయాంలో అయిన పని. 
  • మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం రీ ఎస్టిమేట్ చేసి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ గా  రూ.55,656 కోట్లు అవుతాయని కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం పరిశీలించి 47,725.74 కోట్లకు కుదించింది.
  • మన ప్రభుత్వం ఇప్పటి వరకూ పోలవరంపై ఖర్చు చేసిన రూ.2,600 కోట్లను కేంద్రం రీయంబర్స్ చేయాలని, పనులు మరింత వేగవంతం అయ్యేంకు కనీసం 10వేల కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేంద్రాన్ని కోరుతున్నారు. 
  • చంద్రబాబు హయాంలో డయాఫ్రంవాల్ నిర్మాణంలో జరిగిన లోపాలను సవరించడానికి నేడు అవుతున్న ఖర్చు 2,022 కోట్లు. 
  • చంద్రబాబుకు పోలవరం కాంట్రాక్టర్లకు డబ్బులు పంచడం, కమీషన్లు పొందడం తప్ప ప్రాజెక్టు మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. 
  • పట్టిసీమ గురించి కూడా ఒకసారి పరిశీలిస్తే 
  • 1,615కోట్లతో పట్టిసీమ, 1,578 కోట్లతో పురుషోత్తమ పట్నం కట్టారు. 
  • నిజంగా ఈ రెండు కూడా రైతులకు నీళ్లు ఇవ్వడానికి కాదు, కమీషన్లకోసమే. 
  • ఇంతవరకూ పురుషోత్తమపట్నం ఉపయోగంలోకి రాలేదు. రాదుకూడా. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోలేదు. టీడీపీ అనుకూలురచేత కోర్టులో కేసులు వేయించి స్టే తెచ్చి, ఆ ప్రాజెక్టును ముందుకు కదలనీయలేదు. 
  • చంద్రబాబు హయాంలో పట్టిసీమకు 683 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. వర్షాలు రాక ఎత్తిపోతల మీద ఆధారపడ్డం వల్లే అంత కరెంటు బిల్లు.
  • వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయి...పట్టిసీమ కొద్ది రోజులు మాత్రమే నడిపినా, కరెంటు ఖర్చు 182 కోట్లు మాత్రమే అయ్యింది.
  • 11,060 కోట్లు చంద్రబాబు హయాంలో పోలవరంపై ఖర్చు చేసారు. 
  • 18 నెలలు కోవిడ్ కాలం ఎదురైనా కూడా 5,600 కోట్ల విలువైన పనులు ఈ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికి 1,184 కోట్ల విలువైన పనులు పూర్తికాగా వాటికి బిల్లులు చెల్లించవలిసి ఉంది. 
  • పోలవరం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నది కేవలం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే.
  • పోలవరం మాట లేకుండా ఒక్క ఢిల్లీ టూర్ కూడా ఉండదు. కేవలం పోలవరం కోసమే 10,000 కోట్లు అడ్వాన్స్ గా రిలీజ్ చేయమని కేంద్రాన్ని, ప్రధాని మోదీ గారిని సీఎం వైయస్ జగన్ విజ్ఞప్తి చేసారు.

తాజా వీడియోలు

Back to Top