సీఎం అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌కు న్యాయం చేస్తా

ఎల‌క్ట్రానిక్ మీడియా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, సినీ న‌టుడు అలీ

హైద‌రాబాద్‌: ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులైన సినీ న‌టుడు, వైయ‌స్ఆర్ సీపీ నేత అలీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్ట్రానిక్‌ మీడియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియ‌మించ‌డంపై అలీ స్పందించారు. ఎన్నికల ప్రచారాలలో పాల్గొనడంతో పాటు, పార్టీ అప్పగించిన పనులను నిబద్ధతతో పూర్తి చేశానని, తన సేవలను సీఎం వైయ‌స్ జగన్ గుర్తించారని అలీ చెప్పారు. తనకు ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానని అన్నారు. ఈ పదవిని తన కూతురి పెళ్లికి సీఎం వైయ‌స్ జగన్ ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నానని చెప్పారు. ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా అలీ రెండేళ్లు ప‌ద‌విలో కొనసాగనున్నారు.

తాజా వీడియోలు

Back to Top