తాడేపల్లి: పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే విడదల రజని, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ బత్తుల బ్రహ్మానందరెడ్డి, అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు తొలి విడతగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.264 కోట్లు విడుదల చేసింది. రెండో విడత రూ.800 కోట్లు ఇచ్చిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట బెట్టుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయంతో అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Read Also: సుధాకర్‌రావు మృతికి సీఎం వైయస్ జగన్ సంతాపం