కేవలం 3 నెలల కోసమే రూ.2 వేల పింఛను..

మోసం చంద్రబాబు నైజం..

వైయస్‌ఆర్‌సీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి

కర్నూలు: వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఓ చారిత్రాత్మకం అని వైయస్‌ఆర్‌సీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకున్నారన్నారు.రాష్ట్రంలో ప్రతివర్గాన్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.వైయస్‌ జగన్‌ నవరత్నాల ప్రకటనతో చంద్రబాబుకు మతి భ్రమించిందన్నారు.చంద్రబాబు ప్రకటించిన 2వేల పింఛన్‌ కేవలం మూడు నెలల కోసమే అని అన్నారు.మాటలు సరిగ్గా రాని బాలకృష్ణ ప్రతిపక్షాలపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.తమ ఓటుతో తెలంగాణ ప్రజలు చంద్రబాబును ఏపీ వరుకు తరిమికొట్టారని ఎద్దేవా చేశారు.ఏపీలో కూడా చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదన్నారు.జిల్లాలో 14 అసెంబ్లీ,2 ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

 

Back to Top