సుంకరిపేట రోడ్డు ప్రమాదంపై సీఎం ఆరా

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం

తాడేపల్లి: విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నవారు ప్రమాదానికి గురైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. లారీ ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 

Back to Top