మాఫియా డాన్‌ లాంటి మీడియా పుట్టుకకు బాబే కారణం

పచ్చమీడియా రాతలకు హద్దు లేకుండా పోయింది

చంద్రబాబు చేసిన తప్పులు రాసే దమ్ములేదా..?

ఎన్ని విషప్రచారాలు చేసినా.. చివరికి ప్రజల నమ్మకం గెలిచింది

సీఎం వైయస్‌ జగన్‌ పాలనపై ఎల్లోమీడియా విషం కక్కుతోంది

ఓ పత్రికా అధినేత వల్లే టీడీపీ నాశనమైందని ఆ పార్టీ నేతలు అంటున్నారు

కుల, వర్గ విభేదాలకు ఎల్లో మీడియా డాన్స్‌ కారణం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రామచంద్రయ్య

హైదరాబాద్‌: ప్రభుత్వం చేసే ప్రతి పనిని తప్పుబడుతూ ప్రజల్లో దుష్ప్రచారం చేస్తూ సీఎం వైయస్‌ జగన్‌పై అఇష్టతను ఏర్పరిచే ప్రయత్నం జరుగుతుంది. చంద్రబాబు భజన చేసే పత్రికలు, ఛానళ్లు నాలుగు నెలల పాలన పూర్తికాకముందే ప్రతి రోజూ ప్రభుత్వంపై విషం కక్కుతుంది. జర్నలిజం విలువలను దిగజార్చుతూ ఓ పత్రికా పిచ్చి రాతలు రాస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సీ.రామచంద్రయ్య మండిపడ్డారు. చంద్రబాబు పాలన అద్భుతంగా ఉండేదన్నట్లుగా చూపిస్తున్నారని, చంద్రబాబు పాలనలో అసంబద్ధ, అప్రజాస్వామిక విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎందుకు ఎత్తిచూపించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడుతూ..
– చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే 18 మంది ఎర్రచందనం కూలీలు ఎన్‌కౌంటర్‌లు చనిపోయారు. దానిపై స్పందించారా..?
– మానవహక్కుల హననం జరిగిందని రాశారా..? టీడీపీ ఎంపీలు వెళ్లి మానవహక్కులు కాలరాస్తున్నారని బెస్‌లెస్‌ కంప్లయింట్‌ ఇస్తే దాన్ని పెద్ద హైలెట్‌ చేశారు.
– గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే.. దానికి కారకులైన వారి గురించి రాయకుండా చంద్రబాబు అక్కడే ఉండి వచ్చిన వారు స్నానాలు, పూజలు చేసుకునేట్లు కంట్రోల్‌ రూమ్‌ పెట్టి కష్టపడి పనిచేశారని రాశారు.. 29 మంది చనిపోయేందుకు కారణం ఎవరు రాశారా..?
– ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 23 మంది ఫిరాయింపులకు పాల్పడితే రాశారా..? దీనిపై వార్తలు రాయాలని అనిపించలేదా..? ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దారుణం ఉంటుందా..? ఫిరాయింపుదారుల్లో నలుగురిని మంత్రులను చేస్తే బాబు ప్రభుత్వాన్ని విమర్శించలేరా..?
– ఓటుకు నోటు కేసు.. ఇది ప్రపంచమంతా చూసింది. దాంట్లో చంద్రబాబు తప్పు చూపించారా..?
– ఆర్థికలోటులో రాష్ట్రంలో ఉంటే.. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు ప్రైవేట్‌ విమానాల్లో ప్రపంచం అంతా తిరుగుతూ ప్రజలపై భారం వేస్తూ దుబారా ఖర్చు చేస్తుంటే ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని చెప్పారా..?
– చంద్రబాబు నిర్వహించిన భాగస్వామ్య సదస్సులు బోగస్‌ అని రాసే ధైర్యం లేదా మీకు..?
– కాల్‌మనీ కేసుల్లో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంతమంది లైంగిక వేధింపులకు గురయ్యారు. ఇవన్నీ తెలియదా..? దాని గురించి ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియదా..? నిజమైన సంఘటనలు, వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత పత్రికలపై లేదా..?
– రాజధానిలో రైతుల భూముల కొనుగోలు చేసేటప్పుడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది. అది రాసే ధైర్యం లేదా..?
– మీకు నచ్చిన వ్యక్తిని ప్రమోట్‌ చేసి అతను అధికారంలోకి రావాలని జర్నలిజం విలువలు కూడా కాలరాసి చంద్రబాబు భజన చేశారు. ఈ ఐదేళ్లు భజన చేస్తే వచ్చింది అసెంబ్లీ ప్రసారాల కాంట్రాక్టు సంపాదించుకున్నారు.
– ఓ పత్రికా అధినేత చెప్పిన వారికి టికెట్‌ ఇప్పించే పరిస్థితి తీసుకువచ్చారే.. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పాత్ర మీడియా అధినేతలు పోషించవచ్చా..?

ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడే పచ్చ మీడియా రాతల వల్ల ఎవరు చెడిపోయారు. సీఎం వైయస్‌ జగన్‌ గురించి చాలా చెడ్డగా రాసిన ఎల్లోమీడియా ఏం దెబ్బతీయగలిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిమానం ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక పత్రికా అధిపతి వల్లే టీడీపీ నాశనం అవుతుందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ప్రజాస్వామ్య విలువలతో పత్రికను నడిపి ఉంటే చంద్రబాబుకు సరైన మార్గదర్శకం ఇచ్చి ఉంటే ఇంత దారుణంగా ఓడిపోయేవారు కాదు.. మాఫియా డాన్‌ మాదిరిగా మీడియా పుట్టుకకు చంద్రబాబు కారణం. చంద్రబాబు ఆయన క్రియేట్‌ చేసుకున్న ప్రపంచంలో బతుకుతున్నారు. అధికారంలో శాశ్వతం అనుకొని ఉన్నవి లేనట్లుగా.. లేనివి ఉన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కుల, వర్గ విభేదాలకు ఈ మీడియా డాన్లు కారణమని రామచంద్రయ్య అన్నారు.

Read Also: కోలుకునేవరకు ఆర్థికసాయం

 

తాజా ఫోటోలు

Back to Top