టీడీపీ అవినీతి పుట్టలు బద్దలవుతున్నాయి

విచారణ అంటే చంద్రబాబుకు ఎందుకంత ఉలిక్కిపాటు 

విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు

చంద్రబాబు పాలనలో రాష్ట్రం సర్వనాశనం

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

విజయవాడ: అక్రమాలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి  చర్యలు తీసుకుంటే కక్షసాధింపు చర్యగా టీడీపీ నేతలు చిత్రీకరించడాన్ని  వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తప్పుబట్టారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..సీఎం జగన్‌  న్యాయబద్ధంగా చర్యలు తీసుకుంటే అది కక్ష సాధింపా అని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు.గత టీడీపీ ప్రభుత్వం అవినీతి పుట్టలు బద్దలువుతున్నాయన్నారు. రాజధాని,పోలవరం ప్రాజెక్టు, విద్యుత్‌ ఒప్పందాలు,భూ కేటాయింపులు వంటి లక్షల కోట్ల అవినీతికి సంబంధించి విషయాలు వెలుగు చూస్తున్నాయన్నారు.

గత ప్రభుత్వంలో 30 అంశాలను సమగ్ర పరిశీలన చేసి వాస్తవాలను నిగ్గుతేల్చడానికి ఒక కమిటీ వేయడానికి  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం నేతలు ఎందుకంత ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. అవినీతి,అక్రమాలు చేయకపోతే ఎంతకింత అవేశపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. కొత్త  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా కొన్ని అంశాలను సమీక్షించాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకుంటే..టీడీపీ నేతలకు ఎందుకంత కంటగింపు అని ప్రశ్నించారు.అక్రమాలు బయట పడుతున్నాయని తెలుగుదేశం నేతలు భయంతో వణికిపోతున్నారన్నారు.విద్యుత్‌ ఒప్పందాలకు సంబంధించి అక్రమాలపై సమీక్షించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు.టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో విద్యుత్‌ కొనుగోలు బకాయిలు 18 వేల కోట్ల రూపాయలు ఉన్నాయంటే  ఏవిధంగా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారో అర్థమవుతుందన్నారు.ఏపీని చంద్రబాబు.. అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారన్నారు.టీడీపీ అక్రమాలను చూసి ప్రజలు అశ్చర్యపోతున్నారన్నారు. 2,600 కోట్ల విద్యుత్‌ కొనుగోలు సంబంధించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు.

విద్యుత్‌ ఒప్పందాల్లో అవినీతికి పాల్పడటమే కాకుండా విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.గత ప్రభుత్వ నిర్ణయాలు కారణంగా విద్యుత్‌ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు.రాష్ట్రంలో ఉన్న  అన్ని వ్యవస్థలను కుక్కలు చింపిన విస్తరిగా మార్చేశారన్నారు. నెలరోజులు వ్యవధిలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వ్యవస్థలను ఒక రూపుకు తీసుకు వస్తున్నారన్నారు.అన్ని శాఖల అధికారులు,మంత్రులతో సమీక్షించి రాష్ట్రాన్ని కష్టాల నుంచి గట్టు ఎక్కించడానికి సీఎం వైయస్‌ జగన్‌ తపన పడుతున్నారన్నారు.చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదన్నారు. వీధి రౌడీల్లా తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బ్రహ్మండమైన మెజార్టీతో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలంతా ఎన్నుకున్నారని..దేశంలో ఎవరికి రాని 50 శాతం ఓట్లు సాధించారన్నారు. 151 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి ప్రజలు ఎన్నుకున్న సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టానుసారంగా టీడీపీ నేతలు మాట్లాడటం మానుకోవాలని ధ్వజమెత్తారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top