అమరావతి: ‘ప్రజల ఇచ్చిన తీర్పు చంద్రబాబు అహంకారానికి చెంపదెబ్బ’అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు.ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు అరాచక,అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే జీవితాల్లో మార్పు వస్తుందని ప్రజలు ప్రగాఢంగా నమ్మారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఎన్నో దీక్షలు,పోరాటాలు చేసిన నేతగా వైయస్ జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారని తెలిపారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీకి 151 అసెంబ్లీ సీట్లు,22 పార్లమెంటు స్థానాలు ఇచ్చి అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు పాలనను తరిమికొట్టాలనే లక్ష్యంతో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు,కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేశారని తెలిపారు. ఇప్పటి వరుకు దేశంలో ఏ పార్టీ కూడా 50 శాతం ఓట్లు సాధించిన దాఖలాలు లేవన్నారు.50 శాతం కంటే మించి విశ్వాసం పొందిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని తెలిపారు. ఈ విజయం ఆషామాషీగా వచ్చింది కాదని,వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశ్వసనీయతకు నిదర్శనంగా వచ్చిందన్నారు. దివంగత మహానేత వైయస్‌ఆర్ తనయుడుగా వైయస్ జగన్..ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని, ప్రజల కోసం పనిచేస్తారని గొప్ప నమ్మకంతో ప్రజలందరూ ఆశ్వీరందించారన్నారు. ప్రజల కోసం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పోరాటాలు చేశారన్నారు.నిత్యం ప్రజలతో మమేమకమై ఉన్నారన్నారు.14 నెలలు పాదయాత్ర చేసిన ఘనత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిది అని అన్నారు.వైయస్ జగన్ కష్టఫలితంగానే ఈ విజయం సాధ్యమయిందన్నారు. ఇద్దరుతో ప్రారంభమైన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు 151 ఎమ్మెల్యేలు,22 ఎమ్మెల్యేలతో గొప్ప రాజకీయ శక్తిగా ఆవిర్భవించిందన్నారు. వైయస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాజకీయ విలువలను కాపాడుతూ..రాజ్యాంగాన్ని గౌరవించారన్నారు.ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు,దుష్టపాలనను కప్పిపుచ్చిన ఎల్లో మీడియా నేటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటలను వక్రికరించే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు.రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. ఇంత ఘన విజయం సాధించిన తర్వాత వైయస్ జగన్ ఆనందం, ఆడంబరాల్లో మునిగి తేలడం లేదని, ప్రతిక్షణం కూడా ఈ రాష్ట్రం గురించి ఏమి చేయాలనే ఆలోచనలు చేస్తున్నారన్నారు.దానిలో భాగంగానే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి నది జలాల సమస్యలు గురించి మాట్లాడారని తెలిపారు.ప్రధాని వద్దకు వెళ్ళి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించారని తెలిపారు.ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారని తెలిపారు.మొదట నుంచే కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించాలని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.రాష్ట్ర హక్కుల్ని,ప్రత్యేకహోదా,విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. కేంద్రం ఏపీపై వివక్షత చూపితే పోరాటం చేస్తామన్నారు.రాష్ట్ర హక్కులను కాపాడుకోవడానికి ఏస్థాయికైనా పోరాటం చేస్తామన్నారు.రాష్ట్రానికి మంచి జరగాలన్నదే వైయస్‌ఆర్‌సీపీ లక్ష్యం అని అన్నారు.రాష్ట్ర ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలనేది వైయస్ జగన్ ఆకాంక్షగా పేర్కొన్నారు. లోకేష్‌కు కూడా చంద్రబాబులాగా ఏరుదాటక తెప్ప తగలేసే అలవాటు ఉన్నట్లుగా కనబడుతుందన్నారు. 2014లో విజయం సాధిస్తే అది చంద్రబాబు గొప్పతనం,అనుభవం,దూర దృష్టి అంటూ ఆకాశానికి ఎత్తేశారని,నేడు ఓడిపోతే 90 శాతం కార్యకర్తలు,నాయకులదే బాధ్యత అని చెప్పే స్థాయి దిగజారిపోయారని విమర్శించారు.చంద్రబాబు,లోకేష్‌లు పిరికిపందలుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఓటమిని నాయకులు,కార్యకర్తల మీద నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.కుట్ర పూరిత రాజకీయాలు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే తగు రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.ఓడిపోయిన చోటే తిరిగి గెలిచే సత్తా ఉందని లోకేష్ వ్యాఖ్యలను ఉత్తరకుమార ప్రగల్భాలుగా అభివర్ణించారు.లోకేష్ గురించి రాష్ట్ర ప్రజలందరికి తెలుసునన్నారు.ప్రపం^è స్థాయి రాజధాని ఏర్పాటు, సింగపూర్ కంపెనీలు వచ్చాయని బ్రహ్మాండగా అభివృద్ధి చేశామని చంద్రబాబు అవాస్తవాలు చెప్పారని,ఎక్కడయితే అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పారో..అక్కడే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.మంగళగిరి ప్రజలు తగురీతిలో బుద్ధి చెప్పారన్నారు.ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ యుగపురుషుడు అంటూ పోగడ్తలు కురిపించిన చంద్రబాబు ఏవిధంగా ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించారో కూడా రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు.