సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం 

అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ చైర్మన్‌, వైయస్ఆర్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి

అగ్రిగోల్డ్‌  ఆస్తులను కాజేయాలని చంద్రబాబు, టీడీపీ నేతల ప్రయత్నం

చంద్రబాబు నిర్వాకం వల్లే అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్లు చనిపోయారు

బాధితుల బాధలు వైయస్‌ జగన్‌ పాదయాత్రలో విన్నారు

ఆదుకుంటామని హామీ ఇచ్చిన వైయస్‌ జగన్‌ మాట నిలబెట్టుకున్నారు

అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయించడంపై సీఎంకు కృతజ్ఞతలు 

తాడేపల్లిలో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశం

తాడేపల్లి:  ఇచ్చిన మాట ప్రకారమే మొదటి కేబినెట్‌లోనే బాధితులను ఆదుకుంటూ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ చైర్మన్‌, వైయస్ఆర్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.1150 కోట్లు కేటాయించడం పట్ల బాధితుల బాసట కమిటీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా పరిహారం తీసుకోవాలని సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే విడదల రజినీ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయానికి సంబంధించి అగ్రిగోల్డ్‌ బాధితులు అనేకమార్లు ఉద్యమాలు చేసినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించకుండా ఉక్కుపాదంతో అణచివేశారని, అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ఇవాళ వైయస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజుల్లోనే ఏ ఒక్కరూ కూడా ఉద్యమాలు చేయడం లేదన్నారు. అగ్రిగోల్డు బాధితులు అడకకుండానే వారికి సాయం చేసిన గొప్ప వ్యక్తి వైయస్‌ జగన్‌ అని కొనియాడారు. రాష్ట్రంలో 98 బ్రాంచ్‌లలో అగ్రిగోల్డు బాధితులను ఈ రోజు పిలిచి మాట్లాడితే..ప్రతి ఒక్కరూ కూడా వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. ప్రభుత్వమంటే సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్లడమే కాదు..పేద ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడవడమే ఈ ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తుందని చెప్పారు.  టీడీపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నానని, ఏ ఒక్క బాధితుడినైనా చంద్రబాబు ప్రభుత్వం ఆదుకుందా అని నిలదీశారు. ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని, ఈ రోజు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం బాధితులకు అండగా నిలిచిందని తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారు కాబట్టే పేదల గురించి ఆలోచించి సాయం చేస్తున్నారని తెలిపారు. ఈ రోజు సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా తమ అభిప్రాయాలు చెప్పారని, రాష్ట్రానికి సీఎంగా వైయస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత అందరూ సంతోషంగా ఉన్నారని, ఆయన హస్తవాసీ చాలా మంచిదని కొనియాడారని చెప్పారు. అగ్రిగోల్డు బాధితులకు ఇచ్చే పరిహారాన్ని వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా ఇప్పించాలని బాధితులు కోరారని చెప్పారు. ఈ సమావేశానికి మంత్రులు మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారని, సీఎం చేతుల మీదుగా పరిహారం అందిస్తామని చెప్పారు. 
చంద్రబాబుకు, లోకేష్‌కు ఎక్కడా ఏమి జరిగినా కూడా రాజకీయ రంగు పులమండం అలవాటుగా మారిందన్నారు. ఇసుకపై లోకేష్‌ దీక్షా చేస్తున్నారని తెలిసిందన్నారు. అగ్రిగోల్డు బాధితులు 19 లక్షల మంది రోడ్డుపైకి వస్తే వారి గురించి మాట్లాడేందుకు వీరికి నోరు పెగల్లేదన్నారు. అగ్రిగోల్డు ఆస్తులు కాజేయాలని కుట్రలు చేశారన్నారు. ఇసుక అనే పదాన్ని ఉచ్చరించే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. మీ బినామీలకు దోచిపెట్టి, ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్నారు. ఇవాళ వరదల కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తే దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా టీడీపీ నేతలు దీక్షలు చేశారా అని నిలదీశారు. ఇవాళ తిన్నది అరగక దీక్షలు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఇసుక దోపిడీ జరిగిందని, లోకేష్‌ను విచారణ చేస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. గతంలో ఇసుక కుంభకోణాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ నిర్వహించిన బాధితుల బాసట కమిటీ సమావేశంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా పరిహారం తీసుకోవాలని ఏకరూప తీర్మానం చేసినట్లు లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. 

 

Read Also: అగ్రిగోల్డ్‌ బాధితుల జీవితాల్లో వెలుగులు

తాజా వీడియోలు

Back to Top