సుజనా చౌదరి లోపల పచ్చచొక్కా ఇంకా అలాగే ఉంది 

ప్రజాధనం లూటీని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు

ట్విట్టర్‌ లో నిప్పులు చెరిగిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి: బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సుజానా చౌదరి బీజేపీలో చేరినా ఇంకా టీడీపీ అధికార ప్రతినిధిలాగే వ్యహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పోలవరం కాంట్రాక్టుల రద్దు, విద్యుత్‌ పీపీఏ ఒప్పందాల్లో అవినీతిపై సమీక్ష.. ఇలా వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలను కేంద్రం అడ్డుకుంటున్నట్లు సుజనా చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాధనం లూటీని సుజనా సమర్థించడం చూస్తుంటే లోపల వేసుకున్న పక్క చొక్కా అలాగే ఉందనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ లో స్పందించారు. 
 

Back to Top