తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు నియామకాలు చేపడుతూ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటనలు వెలుబడ్డాయి. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) మెంబర్‌గా మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పల్నాడు జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పఠాన్ సలేహా ఖాన్(పీఎస్ ఖాన్) ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ ఉపాధ్యక్షుడిగా మైలవరం నియోజకవర్గానికి చెందిన పామర్తి శ్రీనివాసరావును నియమించారు.