గిరీశ్ క‌ర్నాడ్ మృతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

అమ‌రావ‌తి: ప్రముఖ దక్షిణాది నటుడు గిరీశ్ కర్నాడ్ మృతి చెంద‌డం ప‌ట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చ‌శారు. ఈ రోజు ఉదయం బెంగళూరులో గిరీశ్ క‌ర్నాడ్ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. మహారాష్ట్రలోని మాతేరన్ లో 1938 మే 19న జన్మించిన గిరీశ్ కర్నాడ్, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి ఈ ఉదయం 6.30 గంటల సమయంలో మృతిచెందారు. 1998లో జ్ఞానపీఠ్ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top